మంచి నీళ్ల బాటిల్ దొంగతనానికి ప్రయత్నించడమే అతడి నేరమైంది. పోనిలే పాపం.. ఎంత దాహం మీద వున్నాడో అని వదిలి పెట్టకుండా ఆ అభాగ్యుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. దెబ్బలకు తాళలేక ఎంతగా వేడుకున్నా వినిపించుకోలేదు. బతిమాలి బతిమాలి చివరికి ప్రాణం వొదిలాడు. ఇదెక్కడో బీహార్ లో జరిగిన ఘటన కాదు. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో వున్న విజయవాడలో జరిగింది. నాగరిక ప్రపంచం నివ్వెరపోయే ఈ అమానుషం మారుతున్న మానవ విలువల్ని ప్రతిబింభించింది.
తెలంగాణలోని నల్గొండ పట్టణానికి చెందిన 33 ఏళ్ల మాస సాయికుమార్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరులో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అప్పుడప్పుడు వారిని చూడటానికి వెళ్లి వస్తుండేవాడు. నాలుగు రోజుల క్రితం విజయవాడకు వచ్చాడు. విజయవాడకు ఎందుకు వచ్చాడో తెలియదు. అయితే భార్యకు మాత్రం ఫోన్ చేసి తాను విజయవాడలో వున్నట్లు చెప్పాడు.
ఈ నెల 18వ తేదీ పటమట డొంక రోడ్డులోని ఒక మద్యం దుకాణం వద్దకు వచ్చాడు. అప్పటికే బాగా దాహంతో వున్న సాయికుమార్ సమీపంలో వున్న పాన్ షాపులోని ఫ్రిజ్‌లోంచి నీళ్ల బాటిల్‌ను తీసుకునేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పాలు సరఫరా చేసే వాహనం వచ్చింది. ఆ వాహనం డ్రైవర్ సాయికుమార్ నీళ్ల బాటిల్ తీయడాన్ని గమనించాడు. ఈ విషయాన్ని పాన్ షాపులో పనిచేసే రవిశంకర్‌కు ఫోన్ చేసి చెప్పాడు.
వెంటనే రవిశంకర్ రెచ్చిపోయాడు. సాయికుమార్ ను పట్టుకొని చితకబాదాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. కొట్టు కుంటూ కొట్టు కుంటూ దగ్గరలో వున్న ఒక దుకాణం వెనకకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. పక్కనే మద్యం దుకాణంలో పనిచేసే అయ్యప్ప శంకర్ తో కలిసి సాయి కుమార్ ను ఒక విద్యుత్ స్తంభానికి కట్టేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్ అనే మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి సాయి కుమార్ ను విపరీతంగా కొట్టారు. కర్రలతో దాడి చేశారు.
దారిన పోతున్న వాళ్ళు ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆ దెబ్బలకు తాళలేక తనను విడిచి పెట్టమని సాయి కుమార్ ప్రాధేయ పడ్డాడు. రెండు చేతులు ఎత్తి దండం పెట్టి వేడుకున్నాడు. నాకు భార్యా పిల్లలు వున్నారు, నన్ను ఒదిలి పెట్టండని బతిమాలుకున్నాడు. అయినా వాళ్ళు వినలేదు. చివరికి సాయికుమార్ ప్రాణాలు పోయింతర్వాత వొదిలి పెట్టి పరారయ్యారు. ఈ ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
This post was last modified on October 23, 2026 6:23 am
కథ ఎక్కడ జరిగినా సరే, అందులో ఏ ప్రాంత భాష, యాస ఉన్నా సరే.. అన్ని ప్రాంతాల వాళ్లూ చూస్తేనే…
టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…
భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…
సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…
తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…
కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…