భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే దాని తాలూకు పరిణామాలు ఒక్కోసారి ఊహించని విధంగా ఉంటాయి. పెద్ది విడుదలైనప్పుడు జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ మీద ఎంత చర్చ జరిగిందో ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేరు. దీని దెబ్బకు ఇప్పుడు సౌత్ దర్శకులు ఎవరైనా కథ చెప్పడానికి వస్తే జాన్వీ ముందే నో చెబుతోందట. మరీ బ్రతిమాలితే పాత్రని చాలా లోతుగా పోస్ట్ మార్టం చేస్తోందని టాక్.
ఇక అసలు విషయానికి వస్తే ప్యారడైజ్ ఒప్పుకున్నప్పుడు కయదు లోహర్ ఇదో కెరీర్ బ్రేక్ సినిమా అవుతుందని భావించి ఉంటుంది. ఎందుకంటే దసరాలో కీర్తి సురేష్ ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రెజెంట్ చేసిన విధానం పెర్ఫార్మన్స్ కి చాలా స్కోప్ ఇచ్చింది. అదే భావనతో నాని లాగా నీ ఇష్టం శ్రీకాంత్ అనేసి ఎస్ చెప్పి ఉండొచ్చు. తీరా చూస్తే అప్పులు తీర్చడానికి ఆమె తల్లినే స్వయంగా నీలి చిత్రాలు తీసే విచిత్రమైన క్యారెక్టర్ డిజైన్ చేయడం, దానికి నెగటివిటీ రావడం అసలు ట్విస్ట్.
చుక్క చిత్రాలు పేరుతో శ్రీకాంత్ ఓదెల ఆమెను చూపించిన వైనం ఓటిటిలో వచ్చాక మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది. కేవలం కయదు లోహర్ క్లిప్స్ ని మాత్రమే తీసుకుని ఎక్స్ ఇన్స్ టాలో ట్రోల్ చేస్తున్న వైనం ఖచ్చితంగా ఆమెను బాధించి ఉంటుంది. కథ పరంగా కూడా తనకు దక్కిన ఇంపార్టెన్స్ తక్కువే. సెకండాఫ్ లో అయితే మరీ నల్లపూసగా మార్చి చివర్లో కాసేపు నక్సలైట్ల బట్టలు వేయడం తప్పించి ఏమీ చేయలేదు. అందుకే ఇంత క్రిటిసిజం వచ్చింది.
అయినా దర్శకులు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఏదో మాస్ ని మెప్పించాలని, లేదా గ్లామర్ షో కోసం ఇప్పటికీ పాకులాడే ఆడియన్స్ ఉన్నారని భ్రమలో ఉంటే మటుకు అది చాలా ప్రమాదం. ఆ కాలాలు పోయాయి. ఐటెం సాంగ్స్ కు కూడా క్రమంగా ప్రాధాన్యత తగ్గుతోంది. జెన్ జీ వాటిని డిమాండ్ చేయడం లేదు. అలాంటప్పుడు చుక్క చిత్రాలు లాంటి కాన్సెప్ట్స్ కాకుండా ఇంకేదైనా క్రియేటివ్ గా ఆలోచిస్తే బాగుంటుంది. లేదంటే ఈ ఆన్ లైన్ విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంటుంది.
This post was last modified on October 22, 2026 11:18 pm
టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…
సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…
తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…
కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…
225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలవడం.. మేయర్ పదవి మీద గురి పెట్టడం…