Political News

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఎలాంటి భద్రతా సిబ్బంది, కాన్వాయ్‌ లేకుండా ముఖ్యమంత్రి నివాసానికి పవన్ కళ్యాణ్ రావడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుతో కాసేపు చర్చించిన తర్వాత వెళ్లి పోయారు. అయితే ముఖ్యమంత్రితో ఆయన ఏమి మాట్లాడారని ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు.

నిన్నా, ఈ రోజు జరిగిన పరిణామాల గురించి పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల వాయిదా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్బంగా జరుగుతున్న ఘర్షణల గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలల్లో కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొంది. సీట్ల సర్దుబాటుకు విరుద్ధంగా రెబల్స్ అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఇది రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది. ఈ విషయం గురించి చర్చించినట్లు సమాచారం. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో కూటమి సీట్ల సర్దుబాటు, పోటీ నుంచి రెబల్స్ విరమించుకునేందుకు అంగీకరించిన విషయంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడటం, తదనంతర పరిణామాలపై ఇరువురు నాయకులు మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలు కూటమి పార్టీలకు ఇబ్బందిగా మారకుండా పక్కా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రభావం ప్రాదేశిక ఎన్నికలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక ఎన్నికలలో విజయం సాధించడం ఒక్కటే లక్ష్యం కావాలని, ఆ దిశగా శ్రేణులను సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

క్షేత్రస్థాయిలో ఎన్ని సమస్యలు వచ్చినా పై స్థాయిలో దాని ప్రభావం పడకుండా చూడాలని ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చారు. కూటమి విడిపోతే తీరని నష్టం జరుగుతుందని, వైసీపీకి చేజేతులా అవకాశం ఇచ్చినట్లవుతుందన్న చర్చ జరిగిందని తెలుస్తుంది. అవసరమైతే టీడీపీ, జనసేన లో సీట్లు రాని నాయకులకు ప్రత్యామ్నాయంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

This post was last modified on October 22, 2026 9:28 pm

Share

Recent Posts

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

1 hour ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

1 hour ago

అర్జునుడి కష్టాలు పేరుకి తగ్గట్టే ఉన్నాయి

తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…

3 hours ago

ప్రశాంత్ నీల్ బ్రాండ్ మహత్యం ఇది

కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…

3 hours ago

సంజూ మొదలెట్టాడు… నమన్ ధీర్ ముగించాడు!

225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…

3 hours ago

టీడీపీ నో చెప్పాకే ఏబీవీ ఇలా చేశారా?

మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలవడం.. మేయర్ పదవి మీద గురి పెట్టడం…

6 hours ago