Movie News

ఆద‌ర్శ కుటుంబం పెట్టిన బాధలు అన్నీ ఇన్నీ కావు

ఒక‌సారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక దానికే క‌ట్టుబ‌డాల‌న్న కంపల్ష‌న్ ఏమీ లేద‌ని, టాలీవుడ్లో ఈ నార్మ్ తీసేసిన ఘ‌న‌త త‌న‌దే అని స్టార్ ప్రొడ్యూస‌ర్ నాగ‌వంశీ ఒక ఇంట‌ర్వ్యూలో చాలా ఘ‌నంగా చెప్పుకున్నాడు. కానీ పెద్ద సినిమాలు ఇష్టానుసారం డేట్లు మార్చుకోవ‌డం వ‌ల్ల అభిమానుల్లో క‌లిగే అస‌హ‌నం ఒకెత్త‌యితే.. చిన్న చిత్రాల మేక‌ర్స్ ప‌డే బాధ‌లు ఇంకో ఎత్తు.
నాగ‌వంశీ ప్రొడ్యూస్ చేసిన ఆద‌ర్శ కుటుంబం ఎలా ప‌డితే అలా డేట్లు మార్చుకోవ‌డం వ‌ల్ల క‌నీసం ప‌ది సినిమాలు ప్ర‌భావితం అయ్యాయంటే అతిశ‌యోక్తి కాదు.

ది ప్యార‌డైజ్ సినిమాను సెప్టెంబ‌రు 24 నుంచి వాయిదా వేసుకుందామ‌న్నా.. అక్టోబ‌రు 2, 9 డేట్లు బ్లాక్ చేసి ఆ అవ‌కాశం లేకుండా చేసింది నాగవంశీనే అని ఆ మధ్య పుకార్లు వినిపించాయి. ఇక అక్టోబ‌రుకు షెడ్యూల్ అయిన అనేక చిన్న సినిమాల‌కు ఆద‌ర్శ కుటుంబం డేట్ మ‌ళ్లీ మ‌ళ్లీ మార్చ‌డం వ‌ల్ల తీవ్ర ఇబ్బంది త‌ప్ప‌లేదు. అందులో కిల్ల‌ర్ అనే మూవీ కూడా ఒక‌టి.

పెద్ద సినిమాల వ‌ల్ల చిన్న చిత్రాల మేక‌ర్స్ ప‌డే ఇబ్బందులు ఎలా ఉంటాయో.. కిల్ల‌ర్ మూవీ ద‌ర్శ‌కుడు సుక్కు పూర్వాజ్ ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్‌లో ఆవేద‌న స్వ‌రంతో చెప్పుకొచ్చాడు. ముందు తాము అక్టోబ‌రు 9న కిల్ల‌ర్ మూవీని రిలీజ్ చేద్దామ‌నుకున్నామ‌ని.. కానీ ఆ రోజుకు ఆద‌ర్శ కుటుంబం షెడ్యూల్ అయింద‌ని.. త‌ర్వాత ద‌స‌రాకు జైల‌ర్-2 మాత్ర‌మే ఉందిలే అని అప్పుడు వ‌ద్దామ‌నుకుంటే త‌ర్వాత ర‌ణ‌బాలితో పాటు కొన్ని సినిమాలు వ‌చ్చాయ‌ని సుక్కు పూర్వాజ్ తెలిపాడు. చివ‌రికి అక్టోబ‌రు 30కి త‌మ సినిమాను ఫిక్స్ చేస్తే.. మ‌ళ్లీ ఇప్పుడు ఆద‌ర్శ కుటుంబం ఆ డేట్ మీద ప‌డింద‌ని అత‌న‌న్నాడు.

ఈ డేట్ మిస్స‌యితే సంక్రాంతి త‌ర్వాతి వ‌ర‌కు అవ‌కాశం ఉండ‌ద‌ని.. అందుకే 30నే త‌మ సినిమాను రిలీజ్ చేస్తున్నామ‌ని అత‌ను సుక్కు పూర్వాజ్ తెలిపాడు. పెద్ద సినిమాల నిర్మాత‌ల ద‌గ్గ‌ర డ‌బ్బులుంటాయి, డిస్ట్రిబ్యూట‌ర్లు ఉంటారు, థియేట‌ర్లు కూడా అందుబాటులో ఉంటాయి కాబ‌ట్టి వాళ్లు ఎప్పుడొచ్చినా ఇబ్బంది లేద‌ని.. కానీ ఇలా పెద్ద సినిమాల‌కు డేట్లు మార్చ‌డం వ‌ల్ల‌ చిన్న చిత్రాల‌కు మాత్రం అనేక ఇబ్బందులుంటాయ‌ని అత‌న‌న్నాడు.

30న వ‌చ్చే చిత్రాల్లో వేటిక‌వే భిన్న‌మైన జాన‌ర్ల‌లో తెరకెక్కిన సినిమాలు కాబ‌ట్టి, వేటి ప్రేక్ష‌కులు వాటికి ఉంటార‌ని, అన్నీ విజ‌య‌వంతం అవుతాయ‌ని సుక్కు పూర్వాజ్ ఆశాభావం వ్య‌క్తం చేశాడు. కిల్ల‌ర్ ప‌దేళ్ల పాటు నిలిచిపోయే సినిమా అవుతుంద‌ని అత‌న‌న్న‌డు.

This post was last modified on October 22, 2026 2:06 pm

Share

Recent Posts

మెగా కన్ఫ్యూజన్ మళ్ళీ మొదలయ్యింది

2027 సంక్రాంతికి ఏ చిరంజీవి సినిమా విడుదలవుతుందనే దాని మీద మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలయ్యిందని మెగా కాంపౌండ్ టాక్. జనవరి…

5 minutes ago

డీసీఎం పవన్ రాజీనామా ఎందుకు చేస్తారు?

రాష్ట్రంలో ఫేక్ రాయుళ్ళు బరితెగిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే కుట్రలకు పాల్పడుతున్నారు. కూటమి…

11 minutes ago

టీమ్ఇండియా సిరీస్‌లో కొత్త టెక్నాలజీ

క్రికెట్‌లో బ్యాటుకు బంతి తగిలిందో లేదో తెలుసుకోవడానికి థర్డ్ అంపైర్లు టెక్నాలజీ సాయం తీసుకుంటారు. ముఖ్యంగా వికెట్ కీపర్ క్యాచ్…

1 hour ago

జనసైనికులను రెచ్చగొడుతున్నారా అంబటి?

కూటమిలో కుంపటి పెట్టేందుకు వైసీపీ నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. టీడీపీ, జనసేనల మధ్య చిన్న నిప్పు రవ్వ…

1 hour ago

రజిత ఆవేదన కరెక్టేగా

టాలీవుడ్ దర్శకులు ఈ మధ్య ఎదురుకుంటున్న సమస్య లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులను వెతికి పట్టుకోవడం. నిన్న జరిగిన దొంగ నా…

1 hour ago

డ్యామేజ్ తగ్గించే ప్రయత్నాలు ఎన్ని చేసినా

సరిగ్గా నాలుగు వారాలకు ప్యారడైజ్ మూవీ ఓటిటిలో వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్…

2 hours ago