Movie News

రజినీకి ఎంత ముట్టింది?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏమాత్రం కష్టపడకుండా, సుకుమారంగా సినిమాలు చేస్తూనే వందల కోట్ల వసూళ్లు రాబట్టే హీరో అంటే సూపర్ స్టార్ రజినీకాంతే. చాలామంది హీరోల్లా ఆయనేమీ ఒళ్లు హూనం చేసుకుని కష్టపడరు. చాలా ఏళ్ల నుంచి డ్యాన్సులు, ఫైట్ల జోలికే వెళ్లట్లేదు. శారీరకంగా ఆయన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే సన్నివేశాలు రాయరు, తీయరు దర్శకులు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా, తన చరిష్మాను వాడుకుంటూ సరిగ్గా సినిమా తీస్తే చాలు.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందనడానికి ‘జైలర్-2’నే ఉదాహరణ.

ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. మరి కొన్ని రోజుల్లో ‘జైలర్’ కలెక్షన్లను దాటేసి తమిళంలో కొత్త ఇండస్ట్రీ హిట్‌‌గా నిలవడం లాంఛనమే. కంటెంట్ వీక్‌గా ఉన్నప్పటికీ ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతోందంటే అందుకు ప్రధాన కారణం రజనీనే అనడంలో సందేహమే లేదు.

మరి ఇంత పెద్ద సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన రజినీ.. తన వాటా కింద పారితోషకం ఎంత తీసుకుంటున్నాడన్నది ఆసక్తికరం. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రజినీకి రూ.180 కోట్ల దాకా అందుతోందట. రిలీజ్‌కు ముందు పారితోషకంలో కొంత భాగాన్ని రజినీకి అందజేశారు సన్ పిక్చర్స్ అధినేత. విడుదల తర్వాత సినిమా సక్సెస్‌ను బట్టి లాభాల్లో వాటా అందేలా ఒప్పందం కుదిరింది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆ వాటాను కూడా కలిపితే రజినీకి రూ.180 కోట్ల దాకా ‘జైలర్-2’ ద్వారా ఆదాయం అందుతోందట.

ఈ సినిమా ప్రొడక్షన్ మీద పెట్టిన ఖర్చు మహా అయితే వంద కోట్లుండొచ్చు. కానీ పారితోషకాలకే రూ.300 కోట్ల దాకా అయినట్లు తెలుస్తోంది. కొన్ని నిమిషాల క్యామియోకే హృతిక్ రోషన్ రూ.25 కోట్లు అందుకున్నట్లు సమాచారం. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు రూ.35 కోట్లు.. సంగీత దర్శకుడు అనిరుధ్‌కు రూ.15 కోట్ల దాకా ఇచ్చారట. సన్ పిక్చర్స్ ఈ సినిమా ద్వారా రూ.200 కోట్లకు తక్కువ కాకుండా లాభాలు అందుకోనున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on October 22, 2026 9:59 am

Share

Recent Posts

డ్యామేజ్ తగ్గించే ప్రయత్నాలు ఎన్ని చేసినా

సరిగ్గా నాలుగు వారాలకు ప్యారడైజ్ మూవీ ఓటిటిలో వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్…

20 minutes ago

దిల్ రాజు తీసుకున్న తెలివైన నిర్ణయం

విడుదల ఇంకా పదమూడు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టడం ఈ మధ్య కాలంలో ఏ ప్యాన్ ఇండియా సినిమాకు…

3 hours ago

కీల‌క స‌మ‌యంలో కాడి ప‌డేస్తున్నారు

ఏ రాజ‌కీయ పార్టీకైనా కూడా ఎన్నిక‌లే కీల‌కం. తమ స‌త్తా నిరూపించేందుకు.... త‌మ బ‌లం చాటుకునేందుకు ప్ర‌జల్లో త‌మ‌కు ఉన్న…

7 hours ago

స్థానిక నామినేషన్లలో డిష్యుం డిష్యుం

ఎంపిటిసీ, జడ్పిటీసీ ఎన్నికలకు సంబందించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో కూడా…

10 hours ago

లిటిల్ హార్ట్స్ మౌళికి టీవీ ఛానెల్ బ్లాక్‌మెయిల్

యూట్యూబ్‌లో ఫ‌న్నీ వీడియోలు చేసుకునే మౌళి.. నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌తో త‌న టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక…

15 hours ago

ప్రేక్షకులను ఎక్కువ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు

ఒకప్పుడు ఆషామాషీ గ్రాఫిక్స్ తో సినిమా తీసినా చెల్లిపోయేది. స్క్రీన్ ప్లే మేజిక్, మంచి పాటలు పడితే ఎఫెక్ట్స్ లోపాలు…

15 hours ago