సరిగ్గా నాలుగు వారాలకు ప్యారడైజ్ మూవీ ఓటిటిలో వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ యాక్షన్ గ్రాండియర్ నైజాంలో తప్పించి మిగిలిన అన్ని చోట్ల నష్టాలు తెచ్చిన సంగతి తెలిసిందే. ఫ్లాప్ కావడం అందరికి సహజమే కానీ ఈ సినిమా విషయంలో నాని ఏకంగా ట్రోలింగ్ బారిన పడాల్సి వచ్చింది. నెగటివిటీ బాగా స్ప్రెడ్డయ్యింది. ఇలాంటి కంటెంట్ ఇస్తావని ఊహించలేదని ఫ్యాన్స్ వాపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఏకంగా థియేటర్లకు దూరం ఉండిపోయారు.
ఇది మరింత డ్యామేజ్ కాకుండా డిజిటల్ వెర్షన్ లో కొన్ని మార్పులైతే చేశారు. ధూమావతి పాటను ట్రిమ్ చేయడంతో పాటు ఎబ్బెట్టుగా అనిపించిన సోనాలి కులకర్ణి డాన్స్ లేపేశారు. దాంతో పాటు వయొలెన్స్ డోస్ కాస్త తగ్గించి విఎఫ్ఎక్స్ మార్పులు కొన్ని చేశారు. అయితే ముందు ప్రచారం జరిగినట్టుగా పాతిక నిమిషాల కోత లాంటివి లేవు. ఒరిజినల్ గా చూసిన వెర్షన్ కే కొన్ని మెరుగులు దిద్దారు తప్పించి ఏకమొత్తంగా భారీ లెన్త్ కట్ చేయడం లాంటివి లేవు. రెండు మూడు నిముషాలే ట్రిమ్ అయ్యాయి.
సరే ఇలా నష్టాన్ని పూడ్చే ప్రయత్నాలు ఎన్ని చేసినా దాని వల్ల కలిగే ప్రయోజనం తక్కువే. ఎందుకంటే ప్యారడైజ్ ప్రమోట్ అవుతూ వచ్చిన విధానం కుటుంబ ప్రేక్షకులను ముందు నుంచే దూరం పెడుతూ వచ్చింది. ఇప్పుడు ఓటిటిలో ఏదో విప్లవం జరిగినట్టు ఎగబడి చూస్తారన్న గ్యారెంటీ లేదు. అందులోనూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దట్టించిన వయొలెన్స్ మాములుగా లేదు. హోటల్ లో జరిగే ఫైట్ చూస్తే చెప్పొచ్చు ఎంత హింసాత్మక ధోరణిలో స్క్రీన్ ప్లే సాగిందో.
ట్రోలర్స్ తమ క్రియేటివిటీ మళ్ళీ పదును పెట్టి నాని, శ్రీకాంత్ ను విమర్శించినా వాళ్లకు వచ్చే నష్టం ఏమి లేదు. కానీ ఇకపై కథల ఎంపిక, దర్శకుడికి స్వేచ్ఛ లాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండే హెచ్చరికైతే న్యాచురల్ స్టార్ కు దక్కింది. బ్లడీ రోమియో షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. సుజిత్ చూపించే విధానం చాలా కొత్తగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. వయొలెన్స్ మోతాదు తగ్గిస్తారట. వచ్చే ఏడాది వేసవి లేదా దసరాకు రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
This post was last modified on October 22, 2026 12:21 pm
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏమాత్రం కష్టపడకుండా, సుకుమారంగా సినిమాలు చేస్తూనే వందల కోట్ల వసూళ్లు రాబట్టే హీరో అంటే సూపర్…
విడుదల ఇంకా పదమూడు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టడం ఈ మధ్య కాలంలో ఏ ప్యాన్ ఇండియా సినిమాకు…
ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఎన్నికలే కీలకం. తమ సత్తా నిరూపించేందుకు.... తమ బలం చాటుకునేందుకు ప్రజల్లో తమకు ఉన్న…
ఎంపిటిసీ, జడ్పిటీసీ ఎన్నికలకు సంబందించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో కూడా…
యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలు చేసుకునే మౌళి.. నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌తో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక…
ఒకప్పుడు ఆషామాషీ గ్రాఫిక్స్ తో సినిమా తీసినా చెల్లిపోయేది. స్క్రీన్ ప్లే మేజిక్, మంచి పాటలు పడితే ఎఫెక్ట్స్ లోపాలు…