‘రామాయణం’ ప్రాజెక్టు మీద ఏకంగా 4 వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నట్లు ఘనంగా ప్రకటించుకున్నాడు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. ఫస్ట్ పార్ట్ ఇంకో రెండు వారాల్లో విడుదల కాబోతోంది. రిలీజ్ ముంగిట టీం సినిమాను కొంచెం గట్టిగానే ప్రమోట్ చేస్తోంది. రిలీజ్ ప్లానింగ్ కూడా గట్టిగానే చేస్తున్నట్లున్నారు.
పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థలతో టై అప్ అయి.. చాలా అడ్వాన్ప్డ్గా థియేటర్లు చేజిక్కించుకుని.. ప్రి సేల్స్ కూడా చాలా ముందుగానే మొదలుపెట్టేశారు. కానీ అంతా బాగుంది కానీ, ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా పట్ల ఆశించినంత ఆసక్తి చూపించట్లేదు. వరల్డ్ వైడ్ ఎక్కడా ‘రామాయణం’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.
బాలీవుడ్‌కు కేంద్రమైన ముంబయిలో ‘రామాయణం’ విడుదలకు రెండు వారాల ముందే వందల సంఖ్యలో షోలకు బుకింగ్స్ ఓపెన్ చేశారు. బుధవారం బుకింగ్స్ మొదలుపెడితే.. ఒక రోజు గడిచాక సోల్డ్ ఔట్ అవడం సంగతి అటుంచితే.. ఒక్క షో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో కనిపించడం లేదు. మొత్తం షోలన్నీ గ్రీన్ కలర్లోనే కనిపిస్తుండడం షాకింగే. ముంబయిలో ఎక్కువ రేట్లున్న ప్రిమియం థియేటర్లతో పాటు రీజనబుల్ రేట్లున్న మామూలు థియేటర్లలోనూ బుకింగ్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి.
ఉత్తరాదిన ఇంకా పలు నగరాల్లో ‘రామాయణం’ బుకింగ్స్ మోదలుపెట్టగా.. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. గొప్ప కథతో తెరకెక్కిన, ఇంత బడ్జెట్ పెట్టిన, ఇంత కాన్వాస్- స్కేల్ ఉన్న.. స్టార్ కాస్ట్ ఉన్న మూవీకి ఇంత డల్లుగా బుకింగ్స్ ఉండడం విచారకరమే. ‘రామాయణం’ మేకర్స్ ప్రేక్షకుల్లో సినిమా పట్ల క్యూరియాసిటీ కలిగించలేకపోయారన్నది స్పష్టం. వచ్చే రెండు వారాల్లో ఏదో ఒక మ్యాజిక్ జరిగితే తప్ప ‘రామాయణం’కు ఆశించిన ఫలితం దక్కడం కష్టమే.
This post was last modified on October 22, 2026 4:23 pm
ఒకే నెలలో రెండు డేట్లు మార్చుకున్న ఆదర్శ కుటుంబం ఏకే 47 ఫైనల్ గా అక్టోబర్ 30 లాక్ చేసుకున్న…
ఇంకా థియేటర్లలోనే రిలీజ్ కాలేదు. అప్పుడే ఓటీటీలో సినిమాను చూడ్డం గురించి చర్చేంటి అనిపిస్తోందా? ఐతే ‘రామాయణం’ సినిమా మేకర్స్…
2027 సంక్రాంతికి ఏ చిరంజీవి సినిమా విడుదలవుతుందనే దాని మీద మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలయ్యిందని మెగా కాంపౌండ్ టాక్. జనవరి…
రాష్ట్రంలో ఫేక్ రాయుళ్ళు బరితెగిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే కుట్రలకు పాల్పడుతున్నారు. కూటమి…
క్రికెట్లో బ్యాటుకు బంతి తగిలిందో లేదో తెలుసుకోవడానికి థర్డ్ అంపైర్లు టెక్నాలజీ సాయం తీసుకుంటారు. ముఖ్యంగా వికెట్ కీపర్ క్యాచ్…
కూటమిలో కుంపటి పెట్టేందుకు వైసీపీ నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. టీడీపీ, జనసేనల మధ్య చిన్న నిప్పు రవ్వ…