సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రస్థానం మొదలైనట్లే మొదలై ఆగిపోయింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆయన కొన్నేళ్ల కిందటే తన రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటన చేశారు. కానీ పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్లడంలో ఆలస్యం చేశారు. తీరా ఇక రంగంలోకి దిగుదాం అనుకునే సమయానికి కరోనా వచ్చి అడ్డం పడింది. తన ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని రాజకీయాల్లోకి రావడం మంచిది కాదనుకున్నారు. అభిమానులకు క్షమాపణ చెప్పి రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు.
ఐతే ఈ నిర్ణయం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. రజినీ ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా వాళ్లు ఈ కరోనా టైంలో రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. రజినీ నటిస్తున్న ‘అన్నాత్తె’ సంగతి ఎటూ తేలకుండా పోయింది. ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్లో రజినీ పున:ప్రారంభించడం.. వారం తిరిగేసరికి ఆ చిత్ర బృందంలో పలువురు కరోనా బారిన పడటంతో ఆ సినిమా చిత్రీకరణ ఆగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ దెబ్బకు రజినీ తన రాజకీయ అరంగేట్రంపైనా వెనక్కి తగ్గారు. తన నిర్ణయం తర్వాత అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని రజినీ ముందే ఊహించాడు. కానీ ఆ వ్యతిరేకత ఆయన అంచనా వేయలేని స్థాయిలో ఉంది. ఈ పరిస్థితుల్లో రజినీ ఇల్లు దాటి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ‘అన్నాత్తె’ షూటింగ్ సైతం చేయలేని స్థితిని ఎదుర్కొంటున్నారు.
రాజకీయాల్లోకి రాకపోవడానికి అనారోగ్య కారణాలు చెప్పిన రజినీ.. ఇప్పుడు వెంటనే వెళ్లి షూటింగ్‌లో పాల్గొంటే అభిమానులు ఊరుకోరు. కొంత కరోనా భయం కూడా వెంటాడుతుండటంతో ఈ చిత్రాన్ని ఇప్పుడిప్పుడే పున:ప్రారంభించొద్దని రజినీ భావిస్తున్నారట. దీంతో ఈ సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎప్పుడో ఈ సినిమా పూర్తి చేసి మరో సినిమా మీదికి వెళ్లాల్సిన దర్శకుడు శివకు ఎటూ పాలుపోవడం లేదు. వేరే ఆర్టిస్టుల డేట్లన్నీ వృథా అయిపోతున్నాయి. ఐతే రజినీ మాటను కాదని ఏమీ చేసే పరిస్థితి లేకపోవడంతో అతను, సన్ పిక్చర్స్ అధినేతలు సూపర్ స్టార్ ఎప్పుడు వస్తారా అని వేచి చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.
This post was last modified on January 22, 2021 4:45 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…