ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. మాలా తెచ్చా పాలు అంటూ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాయగా వెంకటేష్, నివేత పేతురాజ్ మీద షూట్ చేసిన రొమాంటిక్ సాంగ్ గా విజువల్స్ చూపించారు. మొదట వచ్చిన నారాయణమ్మ ఎప్పుడో వచ్చిన ఏఎన్ఆర్ తోడికోడళ్లుని స్ఫూర్తిగా తీసుకుని కంపోజ్ చేసినది కావడంతో, మాలా మీద ఫ్యాన్స్ ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ట్యూన్ ఆశించినంత క్యాచీగా లేదని కొందరు అభిమానులు పెదవి విరుస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే తమన్ ఇస్తున్న వైబ్ ఏ మాత్రం సరిపోవడం లేదని వాళ్ళ కామెంట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తను గతంలో ఇచ్చిన ఆల్బమ్స్ అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో ఎంత బ్లాక్ బస్టర్సో మళ్ళీ చెప్పనక్కర్లేదు. గుంటూరు కారం యావరేజ్ బొమ్మే అయినా కుర్చీ మడతపెట్టి జనంలో హోరెత్తిపోయింది. అంతగా వీళ్ళ కాంబో వండర్స్ చేసింది. అలాంటప్పుడు ఆదర్శ కుటుంబం నుంచి అంతకు మించి దగ్గుబాటి ఫాన్స్ ఆశించడం తప్పేమి కాదు.
అసలు సమస్య ఏమిటంటే ఇంత క్రేజీ కాంబో ఉన్నప్పటికీ ఆదర్శ కుటుంబంలో పెద్ద స్థాయిలో బజ్ లేదు. అక్టోబర్ 30 విడుదలని డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ లో తెలిసిపోయింది కానీ టీమ్ నుంచి ఇప్పటిదాకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇంకో రెండు రోజుల్లో అనౌన్స్ మెంట్ ఇస్తారు. ఇలాంటి టైంలో అమాంతం బజ్ పెరగాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఛార్ట్ బస్టర్ సాంగ్స్ పడటం. కానీ తమన్ వదిలిన రెండు బాణాలు జస్ట్ ఓకే అనిపించాయి తప్ప పూర్తి మేజిక్ చేయలేదు.
ఇంకా బ్యాలన్స్ ఉన్న పాటలు ఆ పని పూర్తి చేస్తాయేమో చూడాలి. చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఆదర్శ కుటుంబం ఈసారి డేట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకో వారంలోనే రామాయణ, గాడ్జిలా మైనస్ జీరో,సీన్ లాంటి క్రేజీ మూవీస్ లైనప్ ఉన్నప్పటికీ వెంకీ సినిమాకు వేరే ఆప్షన్ లేదు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఆదర్శ కుటుంబంలో నివేత పేతురాజ్ ఒక ముఖ్య పాత్ర పోషించగా డింపుల్ హయతి స్పెషల్ సాంగ్ చేసింది. నారా రోహిత్ చేసిన పోలీస్ పాత్రను ఇప్పటిదాకా పూర్తిగా రివీల్ చేయలేదు.
This post was last modified on October 19, 2026 10:37 pm
ఇతర భాషలకు చెందిన సినీ జనాలు తమ సినిమాల ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చినపుడు కొంచెం కష్టపడి బాగున్నారా అని..…
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘటన ఇప్పుడు దేశ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ముంబయిలో ఫుట్…
సోషల్ మీడియా జమానాలో పెద్ద సినిమాల లీకులు ఆపడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని…
అనంతపురం జిల్లా అంటేనే రాజకీయాలకు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఈ జిల్లా…
బయోపిక్ ట్రెండ్ మళ్ళీ మొదలైపోయింది. మహానటి సావిత్రి టైంలో ఈ జానర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సిరీస్…
నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు పంపిణి చేయనుండటంతో పెద్ద రిలీజ్…