Movie News

రామాయ‌ణం డైరెక్ట‌ర్ కూడా తెలుగు సినిమా పిచ్చోడే

ఇత‌ర భాష‌లకు చెందిన సినీ జ‌నాలు త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన‌పుడు కొంచెం క‌ష్ట‌ప‌డి బాగున్నారా అని.. అంద‌రికీ న‌మ‌స్కారం అని వ‌చ్చీ రాని తెలుగులో మాట్లాడుతుంటారు. కొంత కాలం ఇక్క‌డి సినిమాల్లో ప‌ని చేశాక తెలుగు నేర్చుకునేవాళ్లూ ఉంటారు. కానీ అస‌లు తెలుగు సినిమాతో సంబంధం లేని ఒక బాలీవుడ్ ద‌ర్శ‌కుడు.. హైద‌రాబాద్‌కు వ‌చ్చి త‌న సినిమా ఈవెంట్లో తెలుగు పాట పాడడం మాత్రం అరుదైన విష‌యమే.

సోమ‌వారం ఇదే ప‌ని చేసి పెద్ద షాకిచ్చాడు దంగ‌ల్ మూవీ ద‌ర్శ‌కుడు నితీశ్ తివారి. ఆయ‌న తాజాగా రామాయ‌ణం లాంటి మెగా మూవీని రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌బీర్ క‌పూర్, సాయిప‌ల్ల‌వి, య‌శ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా వ‌చ్చే నెల 5న విడుద‌ల కానుంది. తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో భారీ స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

ఈ ఈవెంట్లో నితీశ్ తివారి స్పీచ్, ఆయ‌న పాట హైలైట్‌గా నిలిచాయి. తెలుగు సినిమాల‌తో త‌న‌కున్న అనుబంధాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. తాను స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో నాగార్జున మూవీ శివ చూశాన‌ని… ఆ తర్వాత చిరంజీవి హిందీలో చేసిన ప్రతిఘటన వీక్షించాన‌ని నితీశ్ గుర్తు చేసుకున్నాడు. అలాగే రాజ‌మౌళి తీసిన‌ మ‌గ‌ధీర‌, ఈగ సినిమాల‌ను తెలుగులోనే చూశాన‌ని.. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌ను హిందీలో చూసే అవ‌కాశం రాజ‌మౌళి ఇచ్చాడ‌ని నితీశ్ తెలిపాడు.

ఈ సంద‌ర్భంగా గీతాంజ‌లి సినిమాలోని నంది కొండ వాగుల్లోన పాట‌ను ఆల‌పించ‌డ‌గా.. ఆడిటోరియం హోరెత్తిపోయింది. అక్క‌డ‌క్క‌డా కొంచెం ప‌దాలు గుర్తు రాక ఇబ్బంది ప‌డ్డ‌ప్ప‌టికీ.. నితీశ్ ఈ పాట పాడ‌డం మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ వేడుక‌లో సాయిప‌ల్ల‌వి, య‌శ్‌ల ప్ర‌సంగాలు అంద‌రినీ అమితంగా ఆక‌ట్టుకున్నాయి

This post was last modified on October 19, 2026 10:52 pm

Share

Recent Posts

తొమ్మిది రోజుల ముందే రామాయణం మెగా ప్రిమియర్

ఏకంగా 4 వేల బడ్జెట్లో రూపొందుతున్న మెగా ప్రాజెక్టు.. రామాయణం. రెండు భాగాలుగా ఈ మెగా మూవీ తెరకెక్కుతుండగా.. ఫస్ట్…

41 minutes ago

వైబ్ సరిపోవడం లేదు తమన్ సాబ్

ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. మాలా తెచ్చా పాలు అంటూ రామజోగయ్య శాస్త్రి…

2 hours ago

ఎవ‌రీ లారెన్స్ బిష్ణోయ్‌?

బాలీవుడ్ న‌టుడు టైగ‌ర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘ‌ట‌న ఇప్పుడు దేశ్యాప్తంగా సంచ‌లనం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ముంబ‌యిలో ఫుట్…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్‌ని తవ్వుతున్న కాకా

సోషల్ మీడియా జమానాలో పెద్ద సినిమాల లీకులు ఆపడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని…

4 hours ago

అనంత‌పురం అంటే అంతే సార్‌!

అనంత‌పురం జిల్లా అంటేనే రాజ‌కీయాల‌కు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నికల స‌మ‌యంలోనూ ఈ జిల్లా…

6 hours ago

పి సుశీల బయోపిక్‌లో రుక్మిణి వసంత్

బయోపిక్ ట్రెండ్ మళ్ళీ మొదలైపోయింది. మహానటి సావిత్రి టైంలో ఈ జానర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సిరీస్…

7 hours ago