పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు సినిమాలకు టాటా చెప్పేసేవారు లేదంటే హీరోయిన్ల పాత్రలు పక్కన పెట్టి వదిన, అక్క పాత్రలకు మారేవాళ్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పెళ్లి తర్వాత కూడా ఎంచక్కా హీరోయిన్ పాత్రలు చేస్తున్నారు. గ్లామర్ రోల్స్‌తోనూ ఆకట్టుకుంటున్నారు. శ్రియ, సమంత లాంటి వాళ్లు ఇందుకు ఉదాహరణ. ఈ కోవలోనే కాజల్ అగర్వాల్ సైతం పెళ్లి తర్వాత స్పీడు చూపిస్తోంది.
పెళ్లికి ముందు ఒప్పుకున్న ఇండియన్-2, ఆచార్య లాంటి భారీ చిత్రాలను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించుకుంటున్న కాజల్.. వీటితో పాటు కొత్త సినిమాలూ ఒప్పుకుంటోంది. ఇప్పటికే తమిళంలో డీకే అనే దర్శకుడితో కొత్త సినిమాను ఒప్పుకున్న కాజల్ అగర్వాల్.. కళ్యాణ్ అనే మరో యువ దర్శకుడి సినిమాకు ఓకే చెప్పిందని సమాచారం. ఈ చిత్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రభుదేవాతో ఆమె రొమాన్స్ చేయబోతోందట.
డ్యాన్స్ మాస్టర్‌గా, హీరోగా, దర్శకుడిగా ప్రతిభ చాటిన ప్రభుదేవా.. ఈ మధ్య నటుడిగా మళ్లీ బిజీ అవుతున్నాడు. దర్శకత్వానికి కొంచెం బ్రేక్ ఇచ్చి వరుసగా సినిమాలు చేసిన అతను.. రెండేళ్ల కిందట మళ్లీ మెగా ఫోన్ పట్టి సల్మాన్ ఖాన్‌తో ‘దబంగ్-3’ తీశాడు. ఆ సినిమా సరిగా ఆడకపోయినా మళ్లీ ప్రభుదేవాతో ‘రాధె’ సినిమా చేస్తున్నాడు సల్మాన్. అది ఈ ఏడాది రంజాన్‌కు విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తీస్తూనే తమిళంలో ‘భగీరా’ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రభుదేవా. ఇప్పుడు అతను, కాజల్ జంటగా కళ్యాణ్ అనే దర్శకుడు ఓ రొమాంటిక్ కామెడీ తీయడానికి సిద్ధమవుతున్నాడట. ఇంతకుముందు తమన్నాతో రెండు సినిమాల్లో రొమాన్స్ చేసిన ప్రభుదేవా.. ఇప్పుడు కాజల్ లాంటి మరో అగ్ర కథానాయికతో జోడీ కడుతుండటం విశేషమే. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటున్న కాజల్.. ‘ఇండియన్-2’ షెడ్యూళ్లను బట్టి కొత్త సినిమాకు డేట్లు ఇవ్వనుంది.
This post was last modified on January 22, 2021 2:08 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…