లేడీ యాంకర్లు హీరోయిన్లవ్వగా లేనిది మనం హీరో ఎందుకు కాకూడదు అన్నట్లుగా ఓ సినిమా చేసి పడేశాడు టాలీవుడ్ టాప్ మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. అతను కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ పరిస్థితులు మామూలుగా ఉంటే ప్రదీప్ హీరోగా అరంగేట్రం చేసి 10 నెలలు అయ్యేది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.
ఇలాంటి చిన్న సినిమాను ఓటీటీకి ఇచ్చి సరిపెడతారని అనుకున్నారు కానీ.. దీని నిర్మాతలు అలా ఏమీ చేయలేదు. మళ్లీ థియేటర్లు తెరుచుకునే వరకు ఎదురు చూశారు. మంచి టైమింగ్ చూసి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 29న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తే కథేంటన్నదానిపై క్లారిటీ లేదు కానీ.. సినిమాలో అనేక కోణాలున్నాయని.. ఏదో కొత్తగానే ట్రై చేశారని అర్థమవుతోంది.
ట్రైలర్లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లు కలిసి రిలీజ్ చేయబోతుండటం. ఈ రెండు సంస్థలు కలిసి ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘భలే భలే మగాడివోయ్’; ‘ప్రతి రోజూ పండగే’ లాంటి చిత్రాలను కలిసి నిర్మించాయి. విడి విడిగా కొత్త సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ కూడా ఉంటాయి. ఐతే ఈ రెండు సంస్థలూ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ లాంటి ఓ చిన్న సినిమాను టేకప్ చేసి కలిసి రిలీజ్ చేయబోతుండటం విశేషమే.
సినిమా మీద వాళ్లకు మంచి గురి అయినా కుదిరి ఉండాలి లేదంటే ప్రదీప్ తన పలుకుబడిని ఉపయోగించి హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా కోసం వీళ్లను రంగంలోకి దించి ఉండాలి. ఈ రెండు పెద్ద బేనర్లు రిలీజ్ చేస్తున్నాయంటే సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందనే ప్రేక్షకులు భావిస్తారు. మరి గీతా, యువి బ్రాండ్స్ ఈ సినిమాకు ఏ మేర కలిసొస్తాయో చూడాలి. మున్నా అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేసింది.
This post was last modified on January 22, 2021 7:29 am
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…