Political News

కాంగ్రెస్‌.. చేతులెత్తిన‌ట్టే.. ఆ ఓటు కూట‌మికే.. !

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించాలని ముఖ్యంగా పోగొట్టుకున్నచోటే ఓటు బ్యాంకును సంపాదించుకోవాలి అని భావిస్తున్న కాంగ్రెస్ నాయకుల పరిస్థితి డోలాయమానంలో పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసిపెట్టుగా మారుతుంది. గత కొన్నాళ్లుగా పార్టీలో పూర్తి స్తబ్దత ఏర్పడింది. ముఖ్యంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న విషయంలో కానీ నాయకుల మధ్య సమన్వయం సాధించే విషయంలో కానీ ఎక్కడ అడుగులు ముందుకు పడడం లేదన్నది వాస్తవం.

అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ఇక పార్టీని ముందుండి నడిపించే బాధ్యతను చేపట్టిన షర్మిల ఇప్పుడు పూర్తిస్థాయిలో తన కుమార్తె వివాహం పైన దృష్టి పెట్టారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన నిరసనలో మాత్రమే ఆమె పాల్గొని వెళ్లిపోయారు. కానీ వాస్తవానికి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందాలని లేదా బలమైన పోటీ ఇవ్వాలని ఇతర రాజకీయ పక్షాలు భావిస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఆ దిశగా ఇప్పటివరకు అడుగులు వేసిన పరిస్థితి కనిపించడం లేదు.

సీనియర్ నాయకుడు మాజీమంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలో కమిటీని వేసినప్పటికీ ఆ కమిటీ ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు కార్యకర్తలను కూడా సమన్వయం చేయడం లేదు. దీంతో జిల్లాల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. ఇది అంతిమంగా కూటమికి మేలు చేస్తుందనేది పరిశీలకులు చెబుతున్న మాట. తటస్థ ఓటర్ కచ్చితంగా కూటమి వైపు ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో పడిన ఒక శాతం ఓటు బ్యాంకు కూటమికే దక్కుతుందని కూడా అంచనా వేస్తున్నారు.

దీంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని ఒక అంచనా. కానీ ఈ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గాని ఇటు సీనియర్ నాయకులు గా ఉన్న పళ్ళం రాజు రఘువీరారెడ్డి వంటి వారు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు ఎత్తేసింది అన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఇది పరోక్షంగా అదేవిధంగా ప్రత్యక్షంగా కూడా కూటమికి కలిసివచ్చే అంశం అని చెబుతున్నారు.

This post was last modified on October 16, 2026 11:45 am

Share

Recent Posts

అనిరుధ్, కావ్య పెళ్లి విందుకు రండి

అనిరుధ్ ర‌విచంద‌ర్ పేరుకు త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడే కానీ.. ప్ర‌స్తుతం ఇండియాలో అత‌నే నంబ‌ర్ వ‌న్ అన‌డంలో ఎవ‌రికీ సందేహాలు…

4 hours ago

పెళ్లి కోసం హ‌త్య‌: 23 ఏళ్లుగా ప్రేమ ఖైదీలు!

ఆ యువ‌తీ యువ‌కులు.. గాఢంగా ప్రేమించుకున్నారు. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డ‌దామ‌ని అనుకున్నారు. కానీ, విధి వ‌క్రించింది. ఓ వ్య‌క్తిని…

4 hours ago

నాగార్జున మళ్ళీ పంచులు వేశారు

కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి రిలీజ్ డేట్ల వ్యవహారం గురించి పంచులు వేశారు. నేరుగా సినిమా పేర్లు ప్రస్తావించకపోయినా, అన్నది…

6 hours ago

ఏపీలో నామినేష‌న్ల తొలిరోజు: ర‌ణ‌రంగ‌మే!

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు శుక్ర‌వారం తెర‌దీశారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. అయితే.. తొలిరోజే ఉమ్మ‌డి క‌డ‌ప, ఉమ్మ‌డి…

7 hours ago

సీబీఐకి సాయికృష్ణ కేసు: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు!

విజ‌య‌వాడ కృష్ణ‌లంక‌కు చెందిన గాదె సాయికృష్ణ డెత్ మిస్ట‌రీ కేసులో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తున‌కు…

8 hours ago

జైలర్ 2 కత్తిరింపుల మీద అనుమానాలు

నిన్న రిలీజైన జైలర్ 2 టాక్, కలెక్షన్లు కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో…

8 hours ago