తమన్ కోసం సూపర్ స్టార్ కబురు!

అల వైకుంఠపురంలో పాటలతో తన టాలెంట్ ఏ స్థాయిలో ఉంటుందో చూపెట్టిన తమన్ కోసం ఇప్పుడు హీరోలు క్యూ కడుతున్నారు. నిన్న మొన్నటి వరకు తమన్ ని పట్టించుకోని హీరోలు అతడినే ప్రిఫర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో తొలిసారిగా వకీల్ సాబ్ కి తమన్ పని చేస్తున్నాడు.

తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా అల వైకుంఠపురములో పాటలు విని తమన్ అయితే బాగుంటుందని మురుగదాస్ కి సూచించాడట. విజయ్ స్వయంగా కాల్ చేసి తన సినిమాకి సంగీతం చేయాలని కోరినట్టు సమాచారం. తమిళంలో కొన్ని సినిమాలకి చేసినా కానీ తమన్ అక్కడ అంత బిజీ కాలేదు.

కానీ ఇప్పుడు తమన్ పాటలకి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు కూడా టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండడంతో అంత ప్రజాదరణ పొందే పాటలు కావాలని హీరోలు కోరుకుంటున్నారు. తమన్ ని ఇది ఉక్కిరి బిక్కిరి చేసే ఆనందమే కానీ ఇన్ని సినిమాలతో అతనిపై ప్రెజర్ కూడా తీవ్రంగానే ఉంటుంది. మరి ఈ ఒత్తిడిలో తమన్ అంచనాలని ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.