మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంత వరకు ఫెయిల్యూర్ అన్నదే లేని, స్టార్లను అద్భుతంగా ప్రెజెంట్ చేసే సామర్థ్యం ఉన్న కొరటాల శివ లాంటి అగ్ర దర్శకుడితో చిరు జట్టు కట్టడం ఇందుకు ప్రధాన కారణం.
‘ఆచార్య’ అనే ఆకర్షణీయ టైటిల్, రామ్ చరణ్ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించడం కూడా అంచనాల్ని పెంచాయి. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా.. అది మెగా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది. ఇప్పుడిక ‘ఆచార్య’ టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాలో కొంచెం దేశభక్తి కోణం కూడా ఉన్న నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ కానుకగా ‘ఆచార్య’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.
‘ఆచార్య’ టీజర్ గురించి ఇప్పటిదాకా ఏ సంకేతాలు రాలేదు. గణతంత్ర దినోత్సవాన టీజర్ రిలీజ్ అయ్యేుట్లయితే అది మెగా అభిమానులకు పెద్ద సర్‌ప్రైజే. ఐతే మే 9న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో టీజర్ వదలడానికి ఇది సరైన సమయంగా కొరటాల అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి సంక్రాంతికే ‘ఆచార్య’ టీజర్‌ను ఆశించారు అభిమానులు. కానీ అప్పుడు ‘వకీల్ సాబ్’ టీజర్ రిలీజవడంతో అదే సమయంలో ఇంకో ట్రీట్ ఎందుకని భావించి ఉండొచ్చు. గణతంత్ర దినోత్సవాన సోలోగా టీజర్ రిలీజ్ చేస్తే ఎక్కువ హైప్ వస్తుందని అనుకుని ఉండొచ్చు. మరి టీజర్లో చిరును కొరటాల ఎలా చూపిస్తాడు.. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది.. ఆయన ఏం పంచ్ పేలుస్తాడు.. మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజర్‌ను ఎలా ఎలివేట్ చేస్తాడు అన్నది ఆసక్తికరం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 21, 2021 2:32 pm
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…