ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా మారింది. కొత్త డేట్ అక్టోబర్ 30 అని ట్రేడ్ వర్గాల్లో బలంగా తిరుగుతోంది కానీ నిర్మాత నాగవంశీ ప్రకటన ఇవ్వడానికి తొందరపడే ఉద్దేశంలో లేరు. తమన్ రీ రికార్డింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇంకో వారం రోజుల్లోపే మొత్తం పూర్తి చేసి హీరోతో పాటు టీమ్ అందరికి షో వేశాక అప్పుడు డేట్ డిసైడవ్వాలని త్రివిక్రమ్ తో సహా అందరూ ఫిక్స్ అయ్యారట.
అయితే అక్టోబర్ 30 విశ్వక్ సేన్ కల్ట్ ఆల్రెడీ రిలీజ్ కు ఫిక్స్ అయ్యింది. ప్రకటన కూడా ఇచ్చేశారు. దీనికి విశ్వక్ దర్శకుడు కూడా. ఇది మిస్ చేయడానికి తనకు సుతరామూ ఇష్టం లేదట. ఎందుకంటే తనదే మరో సినిమా లెగసి డిసెంబర్ 4 వస్తుంది. అంటే కేవలం ముప్పై అయిదు రోజుల గ్యాప్ లో రెండు మూవీస్ రిలీజవుతాయి. అయినా సరే రిస్క్ తీసుకోవడానికి విశ్వక్ రెడీ అయ్యాడు. ఇప్పుడు ఆదర్శ కుటుంబం వల్ల మనసు మార్చుకుంటే ఈ గ్యాప్ మరింత తగ్గిపోతుంది.
ఏది ఏమైనా వీలైనంత త్వరగా హారిక హాసిని నుంచి అనౌన్స్ మెంట్ వస్తే బెటర్ గా ఉంటుంది. కల్ట్ పూర్తిగా యాక్షన్ అండ్ వయొలెన్స్ నిండిన పెద్దల సినిమా. ఇది విశ్వక్ సేన్ ముందే చెప్పాడు. సెన్సార్ కూడా ఏ ముద్ర ఇస్తుందని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. ఒకవేళ ఆదర్శ కుటుంబంతో క్లాష్ అవ్వాల్సి వచ్చినా రెండు పరస్పరం విరుద్ధ జానర్లు కాబట్టి ఎవరి ఆడియన్స్ వాళ్లకు విడిగా ఉంటారనే ఉద్దేశంతో విశ్వక్ ఢీ కొట్టడానికి రెడీ అయినట్టు సన్నిహితులు చెబుతున్న మాట.
ఈ ఏడాది ఫంకీ రూపంలో పెద్ద డిజాస్టర్ చూసిన విశ్వక్ సేన్ కల్ట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. పైగా తనలో డైరెక్టర్ ని మరోసారి బయటికి తీశాడు. బాధ్యత మరింత పెరిగింది. ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైంలో విపరీతమైన హింస ఉండే సబ్జెక్టు ఎంచుకున్న విశ్వక్ సేన్ కల్ట్ లో చాలా షాకులే ఇస్తాడని వినికిడి. కంటెంట్ క్లిక్ అయితే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుందని రషెస్ చూసిన వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి విశ్వక్ సై అంటే సై అంటాడా లేక ఆదర్శంతో పోటీ వద్దంటాడో.
This post was last modified on October 7, 2026 11:05 pm
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…