Movie News

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు పడకపోవడంతో ఎక్స్‌టెండెడ్ రన్‌తో బయ్యర్లు ఇంకొంత రికవర్ చేసుకోగలిగారు. కానీ చివరికి సినిమా ఫెయిల్యూర్‌గానే నిలిచింది. తెలంగాణలో మినహాయిస్తే అన్ని ఏరియాల్లోనూ ‘ది ప్యారడైజ్’ నష్టాలనే మిగిల్చింది. నానికి స్ట్రాంగ్ జోన్ అని పేరున్న యుఎస్‌లోనే ఈ చిత్రం అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టింది.

మొదట్లో వచ్చిన టాక్‌తో పోలిస్తే ఈ సినిమా ఉన్నంతలో మెరుగైన వసూళ్లే రాబట్టినప్పటికీ.. కంటెంట్ విషయంలో చాలా విమర్శలే వచ్చాయన్నది వాస్తవం. నాని బాక్సాఫీస్ ఫుల్ వల్ల.. కేసీఆర్ క్యారెక్టర్ వల్ల ఈ సినిమా తక్కువ నష్టాలతో బయటపడింది కానీ.. లేదంటే పెద్ద డిజాస్టర్‌గా నిలిచేది.

ఐతే నష్టాలు ఏమేర వచ్చాయి అన్నది పక్కన పెడితే.. సినిమా అయితే ప్రేక్షకుల ఆమోదం పొందలేకపోయింది అన్నది వాస్తవం. ఈ సినిమా వల్ల ఎక్కువగా పేరు చెడింది శ్రీకాంత్ ఓదెలకే అనడంలో సందేహం లేదు.
‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌కు ఎక్కడ లేని స్వేచ్ఛ దొరికింది. మళ్లీ అదే హీరో, నిర్మాత కలిసి అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చి సినిమా చేశారు. నిర్మాత భారీ బడ్జెట్ పెడితే.. శ్రీకాంత్‌కు నాని పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ వీటిని శ్రీకాంత్ ఉపయోగించుకోలేకపోయాడన్నది వాస్తవం.

బడ్జెట్ హద్దులు దాటించేశాడు. వర్కింగ్ డేస్ బాగా పెరిగిపోయాయి. చివరికి కంటెంట్ చూస్తే ఆశించిన స్థాయిలో లేదు. తీవ్ర విమర్శలు తప్పలేదు. శ్రీకాంత్ ఇప్పుడొక ఫెయిల్యూర్ డైరెక్టర్‌గా, వన్ ఫిల్మ్ వండర్‌గా మిగిలాడు. ఇప్పుడు అతడికి నాని అందుబాటులో లేనట్లే. శ్రీకాంత్‌తో అతను మళ్లీ ఓ సినిమ చేయొచ్చు కానీ.. అందుకు టైం పడుతుంది. ఈలోపు చిరంజీవితో సినిమా కూడా ముందుకు కదిలేలా లేదు. ఆ సినిమా ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది.

అందుకు కారణాలు ఏవైనప్పటికీ.. ‘ది ప్యారడైజ్’ ఫెయిల్యూర్ వల్లే అది ఆగిందనే అభిప్రాయం ఏర్పడింది. శ్రీకాంత్‌కు ఇప్పుడు సుధాకర్ చెరుకూరిలా ఫ్రీడమ్ ఇచ్చి, ఎంతైనా బడ్జెట్ పెట్టే నిర్మాత కూడా దొరక్కపోవచ్చు. ఈసారి అతను ఎన్నో పరిమితుల మధ్య సినిమా చేయాల్సి ఉంటుంది. అదనపు హంగులు, హడావుడి కంటే.. బలమైన కంటెంట్‌తోనే మెప్పించాల్సి ఉంటుంది. ఇది అతడికి పెద్ద పరీక్ష అనడంలో సందేహం లేదు. ఈ స్థితిలో అతడికి అవకాశమిచ్చే హీరో, నిర్మాత ఎవరన్నదే ప్రశ్నార్థకం.

This post was last modified on October 7, 2026 1:19 pm

Share

Recent Posts

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

2 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

3 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

4 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

5 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

5 hours ago

‘బ్రేకింగ్ బ్యాడ్’తో ‘జైలర్‌’కేం పని?

అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…

6 hours ago