Political News

జగన్ ను చట్టం ముందు నిలబెట్టే పనివ్వమని అడిగాను

మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద రిటైర్డ్ ఐపీస్ ఏబీ వెంకటేశ్వర రావు మళ్ళీ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడిన ఆయన జగన్ మళ్ళీఅధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నారు. తనకు పదవి ఇస్తే జగన్ సంగతి తేలుస్తానంటూ ఇప్పటికే అనేకసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వర రావుకు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ పదవి పట్ల ఆయన పూర్తి సంతృప్తిగా లేరనే చెప్పాలి.

ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి పదవి ఇవ్వమని అడగలేదని, పని అడిగానని తెలిపారు. పదవి ముఖ్యం కాదని, పని ముఖ్యమని, నాకు సరైన పని ఇవ్వని కారణంగా నేనే పని వెదుక్కున్నానని తేల్చి చెప్పారు. జగన్ రాజకీయాలు రాష్ట్రానికి నష్టం చేస్తాయని, విధ్వంసకర, అవినీతి రాజకీయాలు చేస్తున్నాడని, ఏ వ్యవస్థను లెక్క చేయని అనైతిక రాజకీయాల వల్ల రాష్ట్రం దెబ్బ తింటుందని చెప్పారు. జగన్ చేసిన రాజకీయాలు చూసి ఇతరా పార్టీల నాయకులు ఫాలో అయితే రాష్ట్రం కోలుకోవడం కష్టామన్నారు.

తన మొదటి ప్రాధాన్యత సమాజం, రాష్ట్రం బాగుపడాల్లన్నదేనని, దానికోసం ఏమైనా చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీని కోసం టీడీపీలో చేరాలని, ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నప్పటికి అవి జరగలేదన్నారు. పరోక్ష రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని, ప్రత్యేక్షంగా ప్రజల ముందుకు వెళ్లడమే సరైనదని భావిస్తున్నట్లు తెలిపారు.

జగన్ ప్రభుత్వ హయాంలో 2020 ఫిబ్రవరి లో ఏబీ వెంకటేశ్వర రావు సస్పెండ్ కు గురయ్యారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో ఇజ్రాయెల్‌కు చెందిన డిఫెన్స్ కంపెనీ ఆర్టీ ఇన్‌ఫ్లేటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 25 కోట్ల రూపాయల విలువైన నిఘా పరికరాల కొనుగోలు చేశారు. ఆ సందర్బంగా టెండర్లలో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్ తన కుమారుడు చేతన్ సాయి కృష్ణకు చెందిన ‘ఆకాశం అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్’ అనే సంస్థకు అక్రమంగా కట్టబెట్టారని వైసీపీ ఆరోపించింది. పెగాసస్ వివాదంలో కూడా ఏబీ ప్రమేయం వున్నట్లు ప్రచారం జరిగింది. దాంతో అనేక కేసులు ఎదుర్కొన్నారు. చివరికి క్లిన్ చిట్ వచ్చింది.

This post was last modified on October 8, 2026 7:25 am

Share

Recent Posts

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

22 minutes ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

1 hour ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

1 hour ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

6 hours ago

కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…

7 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

9 hours ago