నెట్ ఫ్లిక్స్ ఇండియా తీసిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్‌ల్లో ‘లస్ట్ స్టోరీస్’ ఒకటి. అసలు నెట్ ఫ్లిక్స్‌కు ఇండియాలో పాపులారిటీ తెచ్చిందే ఈ సిరీస్. ఇందులో ముఖ్యంగా కియారా అద్వానీ మీద తీసిన సన్నివేశాలు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేశాయి. అవి రేపిన సంచలనంతోనే మన ప్రేక్షకుల దృష్టి నెట్ ఫ్లిక్స్ మీద పడింది. దానికి సబ్‌స్క్రప్షన్లు వచ్చాయి.
ఇప్పుడు ఆ సిరీస్‌కు తెలుగు వెర్షన్‌గా తెరకెక్కిందే ‘పిట్ట కథలు’. రెండేళ్ల కిందటే ఈ సిరీస్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. కానీ ఈ ప్రాజెక్టుకు అన్నీ సిద్ధం చేసి షూటింగ్ చేయడంలో, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడంలో చాలా ఆలస్యం జరిగింది. అందుకు కరోనా కూడా ఒక కారణం. ఎట్టకేలకు ఈ సిరీస్ రిలీజ్‌కు రెడీ అయింది. ఫిబ్రవరి 19న ప్రిమియర్స్ డేట్ కూడా ఇచ్చారు. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు.
ఐతే లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ అనేసరికి ప్రేక్షకుల దృష్టంతా ‘లస్ట్’ మీదే నిలిచింది. హిందీలో మాదిరే ఇక్కడా బోల్డ్ యాక్ట్స్ ఉంటాయా అని చూశారు. ‘పిట్ట కథలు’ టీజర్ చూస్తే ఆ అంచనాలకు తగ్గట్లయితే కనిపించలేదు. కొన్ని సన్నివేశాలు హాట్‌గానే ఉన్నట్లున్నాయి కానీ.. అవి ఊరికే అలా మెరిసి మాయమైనట్లుగా చూపించారు టీజర్లో. వాటి మీద పెద్దగా ఫోకస్ కనిపించలేదు. శ్రుతి హాసన్ ఇందులో లెస్బియన్ పాత్ర పోషించిందని ఆమె ఓ అమ్మాయితో చేసిన లిప్ లాక్ సీన్‌ను బట్టి అర్థమైంది.
ఐతే లెస్బియన్ల శృంగార సన్నివేశాలు మన కుర్రాళ్లను అంతగా ఆకర్షించేవి కావు. ఈషా రెబ్బా అయితే ఏమంత హాట్‌గా కనిపించలేదు. కానీ అమలా పాల్ మాత్రం ఈ సిరీస్‌లో హాట్ హాట్‌గానే నటించిందని టీజర్ కట్స్ చూస్తే అర్థమైంది. పెళ్లి విఫలమయ్యాక సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అమలా చాలా హాట్ హాట్‌గానే కనిపిస్తోంది. ‘తిరుట్టుపయలే’తో పాటు ‘ఆమె’ చిత్రంలోనూ ఆమె బోల్డ్ యాక్ట్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ అనేసరికి ఇంకా డోస్ పెంచే ఉంటుందని అనుకున్నారు. ‘పిట్ట కథలు’లో బోల్డ్ సీన్స్ పరంగా కుర్రాళ్ల ఆశలన్నీ అమలా మీదే ఉన్నాయని చెప్పొచ్చు.
This post was last modified on January 21, 2021 10:26 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…