సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ హోటళ్లున్నాయని, ఆయనో వ్యాపారవేత్త అని రేవంత్ ఆరోపించారు. ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తనకు హోటళ్లున్నాయని, ఆ విషయాన్ని కొలంబస్, వాస్కోడిగామా రేంజ్ లో కనిపెట్టినట్లు రేవంత్ చెప్పాల్సిన పనిలేదని కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆ హోటళ్ల విషయం తానే చెబుతానని కేటీఆర్ అన్నారు.
తన భార్యా పిల్లలకు బువ్వ పెట్టేందుకు తాను బరాబర్ వ్యాపారం చేస్తానని, అందులో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కుటుంబాన్ని పోషించకుంటే వాళ్లు తంతారు మళ్లీ అంటూ తనపై తానే సెటైర్లు వేసుకున్నారు. ఇక, తనకు వ్యాపారమే కావాలనుకుంటే 10 హోటళ్లు పెట్టేవాడినని, కానీ, తనకు 3 హోటళ్లే ఉన్నాయని చెప్పారు. వ్యాపారమే కావాలనుకుంటే, రాజకీయాలను విడిచిపెట్టి హోటళ్లు నడిపేవాడినని అన్నారు.
ఇక, తన ఎన్నికల అఫిడవిట్ లో ఉన్నదే రేవంత్ చెబుతున్నారని, ఆయన కొత్తగా కనిపెట్టినట్లు బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. తనకు రేవంత్ ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారని ప్రశంసిస్తున్నట్లు చురకలంటించారు. మైసూర్ బోండాలో మైసూర్ లాగే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలుంటాయని కేటీఆర్ చురకలంటించారు. అంతేకాదు, తన హోటళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి కేటీఆర్ ధన్యవాదాలు కూడా తెలిపారు.
అంతకుముందు, కేటీఆర్ కు, ఆయన ఫ్యామిలీకి హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో డెక్కన్ సెరాయ్ ఫైవ్ స్టార్ హోటల్స్, ఎట్ హోమ్ సర్వీస్ అపార్ట్ మెంట్స్, విలువైన భూములు, ఫామ్ హౌస్ లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
This post was last modified on October 1, 2026 10:55 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…