పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న చిత్కార యూనివర్సిటీలో దెయ్యం ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక పుకారు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక వీడియో, కొన్ని ప్రచారాలతో వందలాది మంది విద్యార్థులు అర్ధరాత్రి క్యాంపస్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో వందల మంది క్యాంపస్‌ను వదిలి వెళ్లిపోయారు. మరోవైపు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జి కూడా విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ వర్గాలు ప్రత్యేక కమిటీని వేసి విచారణకు ఆదేశించాయి.
విద్యార్థిని ఆత్మహత్యతో..
గతంలో యూనివర్సిటీ హాస్టల్‌లో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. అయితే.. ఇప్పుడు ఆమె ఆత్మ.. దెయ్యంగా మారి యూనివర్సిటీలో సంచరిస్తోందని.. ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్‌లో తిరుగుతోందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీనికితోడు హాస్టల్ గదుల నుండి వింత అరుపులు వినిపిస్తున్నాయని, ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారనే పుకార్లు కూడా తోడయ్యాయి. దీంతో విద్యార్థులు బెదిరిపోయారు. భయాందోళనకు గురైన విద్యార్థులు అర్ధరాత్రి క్యాంపస్‌లో గుమిగూడి యాజమాన్యం సమాధానం చెప్పాలంటూ నిరసన చేపట్టారు. అదేసమయంలో హాస్టల్ గదుల కిటికీలను కొందరు ధ్వంసం చేశారు.
పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడికి చేరుకున్న పంజాబ్ పోలీసులు విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో విద్యార్థులు కూడా పోలీసులపై తిరగబడ్డారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న చిత్కార యూనివర్సిటీ యాజమాన్యం.. విద్యార్థులు ఆందోళన చేయడం సరికాదని పేర్కొంది. పుకార్లను పూర్తిగా తోసిపుచ్చింది. క్యాంపస్‌లో ఎలాంటి ఆత్మహత్యలు, మరణాలు సంభవించలేదని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఒక విద్యార్థిని అనారోగ్యంతో ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చినప్పుడు హాస్టల్‌కు అంబులెన్స్ వచ్చిందని, దాన్ని చూసి కొందరు తప్పుడు కథనాలు అల్లారని వివరించారు.
పోలీసులు స్పందిస్తూ.. విద్యార్థినులు ఎవరూ కనిపించకుండా పోలేదని, క్యాంపస్‌లో విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. రాత్రి పూట ఎవరో ఆకతాయిలు హాస్టల్ గదుల తలుపులు కొట్టి పారిపోవడం వల్ల ఈ గందరగోళం మొదలై ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని యాజమాన్యం ఏర్పాటు చేసింది. మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. అయితే.. వందల మంది విద్యార్థినులు.. క్యాంపస్‌ను వీడి వచ్చేశారు. వీరిలో ఏపీకి చెందిన పలువురు విద్యార్థినులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.
This post was last modified on September 27, 2026 1:19 pm
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…