Political News

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది. ఆయా నేత‌లు.. ఆయా పార్టీల గ్రాఫ్‌ను బ‌ట్టి.. ఈ సింప‌తీ ప్ర‌భావం ఉంటుంది. ఐదేళ్లు పాల‌న చేసిన వైసీపీ పై ప్ర‌జ‌ల్లో కూడా.. అంతో ఇంతో సింప‌తీ అయితే ఉంది. కానీ.. దీనిని పార్టీ అధినేత జ‌గ‌న్‌, ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు కూడా నానాటికీ దిగ‌జార్చుకుంటున్నారు. ఫ‌లితంగా.. వైసీపీపై ఏవ‌గింపు పెరుగుతోంది.

ఇది వైసీపీ ప‌త‌నానికి దారి తీస్తోంది. ఇక‌, ఇదే అదునుగా ప్ర‌త్య‌ర్థి పార్టీలు కూడా వైసీపీని మ‌రింత డైల్యూట్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. దీనిని రాజ‌కీయ కోణంలో చూసిన‌ప్పుడు.. త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రి ఎత్తుగ‌డ‌లు వారివి. అయితే, ప్ర‌త్య‌ర్థి పార్టీలు వైసీపీని ఇర‌కాటంలోకి నెడుతున్న క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి సింప‌తీ వ‌స్తోందా? రావ‌ట్లేదా? అనేది ముఖ్యం. ఈ కోణంలో చూసిన‌ప్పుడు.. వైసీపీపై ప్ర‌జ‌ల్లో విముఖత ఏర్ప‌డిన ప్ర‌తిసారీ.. ప్ర‌భుత్వ ప‌క్షం కొర‌డా ఝ‌ళిపిస్తోంది. దీంతో వైసీపీకి కోలుకోలేని విధంగా దెబ్బ‌త‌గులుతోంది.

గ‌తంలో తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం అయినా.. ఇప్పుడు డీఎస్సీపై నిర‌స‌న అయినా.. వైసీపీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విముఖ‌త పెరుగుతున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం చర్య‌లు తీసుకుంటుండ‌డంతో సింప‌తీ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. నిజానికి గ‌తంలో టీడీపీ నేత‌ల‌పైనా.. పార్టీ అధినేత చంద్ర‌బాబుపైనా.. కేసులు న‌మోదు చేసిన‌ప్పుడు.. సింప‌తీ ఏర్ప‌డింది. ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి నాటి చ‌ర్య‌ల‌ను ఖండించారు. త‌ద్వారా పెద్ద ఉద్య‌మ‌మే ఏర్ప‌డింది.

కానీ, ఇప్పుడు వైసీపీ విష‌యంలో ఆ త‌ర‌హా ప‌రిస్థితి లేకుండా పోయింది. ఏకంగా 51 మందిపై రౌడీషీట్లు తెర‌వ‌డం రాష్ట్రంలోనే ఫ‌స్ట్ టైమ్ అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ పై ఎవ‌రికీ జాలి క‌ల‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌నీసం వైసీపీకి మ‌ద్ద‌తుగా ఎవ‌రూ నోరు విప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఉపాధ్యాయుల‌పై జ‌రిగిన దాడుల‌ను స‌భ్య స‌మాజం ఎంత సీరియ‌స్‌గా తీసుకుంద‌న్న‌దానికి ఈ చ‌ర్య‌లు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి. ఇక‌, పాద‌యాత్ర ప్రారంభించే నాటికి వైసీపీ నేత‌ల‌పై మ‌రిన్ని కేసులు న‌మోదైనా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జ‌ల నాడికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కార‌ణంగానే.. ఇలా జ‌రుగుతోంద‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న‌మాట‌.

This post was last modified on September 24, 2026 12:18 pm

Share

Recent Posts

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

1 hour ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

6 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

10 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

12 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

13 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

15 hours ago