స్టార్ మా లో పోరుగడ్డ మానసపుత్రిక!!

టెలివిజన్‌ అంటే కేవలం వినోదం కాదు.. అదో బాధ్యత అని మొదటి నుంచీ భావిస్తున్న స్టార్‌ మా ఈ సారి అత్యంత ప్రతిష్టాత్మకమైన ధారావాహికను అందిస్తోంది. అదే ‘రుద్రమదేవి”.

శిరస్సుని అలంకరించిన కిరీటానికి కీర్తి కూర్చున్న సింహాసనానికి గౌరవం, పరిపాలించిన మహా సామ్రాజ్యానికి గొప్ప పేరు తెచ్చి చరిత్ర చలించిపోయేలా పేరు నిలబెట్టిన వీరనారి ‘రుద్రమదేవి’ కథ అత్యంత ప్రతిష్టాత్మకమైన సీరియల్‌గా తెలుగుద్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి మిగల్బబోతోంది.

బడ్జెట్‌ విషయంలో, ప్రమాణాల విషయంలో ఏ మాత్రం వెనకడుగు లేకుండా ఒక అద్భుతాన్ని తమ ప్రియతమ ప్రేక్షకులకు కానుకగా అందిస్తోంది.

వేరే భాషలో చేసి,తెలుగు ప్రేక్షకులకు అనువదించి ఇవ్వడం కాకుండా ఇది నేరుగా తెలుగు (పేక్షకులకు మాత్రమే ప్రత్యేకంగా అలరించబోతున్న కథ “రుద్రమదేవి, జాతీయస్థాయి సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో భారీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్‌ మా అందించబోతున్న ఈ సీరియల్‌ తెలుగు టెలివిజన్‌లో ప్రమాణాలపరంగా కొత్త అధ్యాయం సృష్టించబోతోంది.

“రుద్రమదేవి ధారావాహిక స్టార్‌ మాలో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.

రద్రమదేవి ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/skLfg0BBq7w

Press release by: Indian Clicks, LLC