Movie News

గోల లేకుండా డేట్ వేసుకున్న గూఢచారి 2

ప్యాన్ ఇండియా సినిమాలకున్న అతి పెద్ద సమస్య రిలీజ్ డేట్ వేసుకోవడం. ఒకవేళ మంచి తేదీ దొరికినా దానికి కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ లేదు. పెద్ది నుంచి ఫౌజీ దాకా అందరిదీ ఇదే పరిస్థితి. ప్యారడైజ్ ఈ ఒత్తిడి వల్లే మెడమీద కత్తి పెట్టుకుని చివరి పనులు చేసుకుంటోంది. అందుకే అడివి శేష్ టీమ్ మంచి ప్రణాళికతో తమ గూఢచారి 2ని చక్కగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 వేసుకుని తెలివైన పని చేసింది. ప్రస్తుతానికి ఆ స్లాట్ ఖాళీగా ఉంది. పోటీగా చెప్పుకునేందుకు ఎవరూ లేరు.

ఈ ఏడాది డెకాయిట్ రూపంలో మంచి సక్సెస్ అందుకున్న శేష్ ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో గూఢచారి 2కి ఎక్కువ సమయం పడుతున్నా ఓపిగ్గా భరిస్తున్నాడు. డిసితో సెన్సేషన్ గా మారిన వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఓజి తర్వాత ఆయన ఒప్పుకున్న టాలీవుడ్ మూవీ ఇదే. వినయ్ కుమార్ సిరిగినీది దర్శకత్వంలో రూపొందిన జీ2 షూటింగ్ ప్రస్తుతం కీలక దశలో ముగింపుకొస్తోంది.

గూఢచారి మొదటి భాగం వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. రిలీజ్ డేట్ ప్రకారం చూసుకుంటే తొమ్మిదేళ్ల తర్వాత సీక్వెల్ వస్తోంది. ఫస్ట్ పార్ట్ హ్యాండిల్ చేసిన శశికిరణ్ తిక్కకు కాకుండా ఈసారి దర్శకత బాధ్యతలు వినయ్ కి ఇవ్వడం ప్రారంభంలోనే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కారణాలు ఏమైనా దానికేమాత్రం తీసిపోని రీతిలో జి2 రూపొందుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. బడ్జెట్ కూడా శేష్ కెరీర్ లోనే అత్యథికంగా ఖర్చు పెడుతున్నట్టు ఇన్ సైడ్ టాక్.

వంద కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ లక్ష్యంతో బరిలో దిగనున్న గూఢచారి 2కి హిందీ మార్కెట్ కీలకం కానుంది. మేజర్ నుంచి శేష్ కు అక్కడ గుర్తింపు వచ్చింది. అయితే డెకాయిట్ అనుకున్నంత స్థాయిలో నార్త్ లో మేజిక్ చేయలేకపోయింది. అందుకే జీ2 రూపంలో దాన్ని మళ్ళీ అందుకోవాలనే సంకల్పంతో ఉన్నాడు శేష్. ఈసారి గూఢచారి వివిధ దేశాలు తిరిగి చాలా రిస్కీ యాక్షన్లు చేస్తాడట. ఓవర్ హీరోయిజం లేకుండా దురంధర్ తరహాలో ఆర్గానిక్ డ్రామా ఉంటుందని వినికిడి.

This post was last modified on September 16, 2026 3:48 pm

Share

Recent Posts

డాల‌స్‌ థియేట‌ర్లో తెలుగు మెనూ

తెలుగు వాళ్లు అమెరికాకు వెళ్లి సెటిల్ కావ‌డం అన్న‌ది చాలా మామూలు విష‌యం అయిపోయింది ఈ రోజుల్లో. అక్క‌డ ఏ…

2 hours ago

హీరోగా మాయమై.. దర్శకుడిగా తిరిగొచ్చాడు

కార్తికేయ గుమ్మకొండ.. ఎనిమిదేళ్ల ముందు టాలీవుడ్లో మార్మోగిన పేరిది. తన తొలి చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’తో ఎలాంటి ప్రభావం…

2 hours ago

యూపీఐ ఛార్జీల వెనుక అమెరికా హస్తం ఉందా?

యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలు తీసుకురావడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న చర్చగా మారింది. రూ.2 వేలకు…

4 hours ago

స్కూల్ బంక్ కొట్టి ఈ అమ్మాయిలు ఏం చేశారంటే?

హైదరాబాద్‌లో చదువుకుంటున్న స్కూల్ విద్యార్థినులు 1980ల రోజుల‌ను గుర్తు చేశారు. అప్పట్లో కాలేజీకి వెళ్లే విద్యార్థులు బంక్ కొట్టి సినిమాలకు…

4 hours ago

సెన్సేషనల్ సినిమా ఆలస్యమైతే ఎలా

కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది, రెండు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్ బస్టర్ గా…

5 hours ago

వారం రోజుల్లో ప్యారడైజ్…..ఇక నో కాంప్రోమైజ్

సరిగ్గా వచ్చే వారం ఇదే రోజు ది ప్యారడైజ్ ప్రీమియర్లు పడబోతున్నాయి. సాయంత్రం రాత్రి కలిపి రెండు షోలు ప్లాన్…

5 hours ago