Movie News

డాల‌స్‌ థియేట‌ర్లో తెలుగు మెనూ

తెలుగు వాళ్లు అమెరికాకు వెళ్లి సెటిల్ కావ‌డం అన్న‌ది చాలా మామూలు విష‌యం అయిపోయింది ఈ రోజుల్లో. అక్క‌డ ఏ రాష్ట్రానికి వెళ్లినా.. ఏ సిటీలో అడుగుపెట్టినా తెలుగు వాళ్లు క‌నిపిస్తారు. తెలుగు హోట‌ళ్లు ద‌ర్శ‌న‌మిస్తాయి.

ముఖ్యంగా డాల‌స్ సిటీలో తెలుగు వారి హ‌వా మామూలుగా ఉండ‌దు. అడుగ‌డుగునా తెలుగు కుటుంబాలుండే ఆ సిటీని డాల‌స్ పురం అని కూడా స‌రదాగా పిలుచుకుంటుంటారు మ‌న వాళ్లు. ఆ సిటీలో పెద్ద ఎత్తున తెలుగు హోట‌ళ్లుంటాయి. హోట‌ళ్ల‌కు అచ్చ తెలుగు పేర్లు పెట్టుకుంటారు. అక్క‌డ‌ తెలుగు భాష‌లో మెనూలు కూడా చూడొచ్చు.

ఐతే తెలుగు వాళ్లు పెట్టుకున్న హోట‌ళ్ల‌లో తెలుగు మెనూలుండ‌డం మామూలే కానీ.. నేటివ్ అమెరిక‌న్స్ న‌డిపే ప్ర‌ఖ్యాత థియేట‌ర్ ఛైన్లో తెలుగు లిపిలో మ‌న వంట‌కాల‌తో మెనూ ఉండ‌డం మాత్రం సామాన్య విషయం కాదు. ప్ర‌ముఖ థియేట‌ర్ ఛైన్ సినీ మార్క్ ఇలాగే చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. త‌మ థియేట‌ర్ ఛైన్లో ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో ఉంచే ఆహార ప‌దార్థాల జాబితాలో తెలుగు వంట‌కాల‌ను జోడించింది సినీ మార్క్.

అంతే కాక తెలుగులో ఫుడ్ ఐటెమ్స్ వివ‌రాలు రాసి.. మెనులో ప్ర‌త్యేకంగా తెలుగు లిపిలోనే ముద్రించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. డాల‌స్ న‌గ‌రాన్ని డాల‌స్ పురం అన‌డంలో అతిశ‌యోక్తి లేద‌ని.. అక్క‌డ తెలుగు వారి హ‌వాకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని.. మ‌న వాళ్ల‌కు అమెరిక‌న్స్ ఇచ్చే ప్రాధాన్యానికి కూడా ఇది రుజువు అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

యుఎస్ ఇప్పుడు తెలుగు సినిమాల‌కు పెద్ద మార్కెట్‌గా మార‌గా.. డాలస్ న‌గ‌రంలో మ‌న సినిమాలు పెద్ద ఎత్తున రిలీజై, బంప‌ర్ క‌లెక్ష‌న్లు సాధిస్తుంటాయి.

This post was last modified on September 16, 2026 2:15 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

5 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

6 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

6 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

6 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

8 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

9 hours ago