Movie News

హీరోగా మాయమై.. దర్శకుడిగా తిరిగొచ్చాడు

కార్తికేయ గుమ్మకొండ.. ఎనిమిదేళ్ల ముందు టాలీవుడ్లో మార్మోగిన పేరిది. తన తొలి చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’తో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయినా.. రెండో సినిమా ‘ఆర్ఎక్స్ 100’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడీ యువ కథానాయకుడు. ఆ తర్వాత అతడికి అవకాశాలు వరుస కట్టాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే తరహాలో ముందు వెనుక చూడకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు.

హీరోగానే కాక విలన్‌గానూ ‘గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’ లాంటి క్రేజీ సినిమాల్లో నటించాడు. కానీ ఇవేవీ అతడికి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కానీ మళ్లీ పుంజుకుని ‘బెదురు లంక 2012’, ‘భజే వాయు వేగం’ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. దీంతో కెరీర్ గాడిన పడ్డట్లే కనిపించింది. ఈ ఊపులో మరిన్ని మంచి సినిమాలు చేస్తాడనుకుంటే.. హఠాత్తుగా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడు. రెండేళ్లకు పైగా కార్తికేయ పేరే వినిపించలేదు ఇండస్ట్రీలో. ఇలా గ్యాప్ తీసుకున్న నటులను ఇండస్ట్రీ జనాలే కాదు.. ప్రేక్షకులూ మరిచిపోతారు.

ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది కార్తికేయ ఏమైపోయాడు అంటూ ‘దూకుడు’లో ప్రకాష్ రాజ్ మీమ్ ఒకటి వేసి అతణ్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఐతే ఎట్టకేలకు కార్తికేయ తన పునరాగమనానికి సిద్ధమయ్యాడు. అతను తన కొత్త సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం. తన కోసం సొంతంగా కథ రాసుకుని స్వీయ నిర్మాణంలో సినిమా రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు కార్తికేయ. బుధవారం ఈ చిత్రానికి పెద్దగా హడావుడి లేకుండా ముహూర్త వేడుక కూడా పూర్తి చేశారు.

త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. షూటింగ్ మొదలుపెట్టనున్నారు. దర్శకుడిగా అరంగేట్రం చేయడానికే కార్తికేయ ఇంత గ్యాప్ తీసుకున్నాడని అర్థమవుతోంది. సైలెంటుగా స్క్రిప్టు రెడీ చేసుకుని.. సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. టాలీవుడ్లో ఈ మధ్య కొందరు యువ కథానాయకులు సొంతంగా సినిమాలు తీసుకుంటున్నారు. విశ్వక్సేన్, కిరణ్ అబ్బవరం బాటలోనే ఇప్పుడు కార్తికేయ కూడా మెగా ఫోన్ పట్టేశాడు. మరి తన రీఎంట్రీకి ఆ సినిమా ఎంతమేర ఉపయోగపడుతుందో చూడాలి.

This post was last modified on September 16, 2026 2:12 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

4 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

5 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

5 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

5 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

7 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

8 hours ago