Categories: Trends

అల్లు అర్జున్ మామపై కేసు

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడలో ‘మంత్రి కాస్మోస్’ ప్రాంగణలో ఒక భూవివాదానికి సంబంధించి చంద్ర శేఖర్ రెడ్డిపై పోలీసులకు క్రిమినల్ ఫిర్యాదు అందింది. ‘మంత్రి కాస్మోస్’ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమ భవన ప్రాంగణంలోకి చంద్ర శేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి అక్రమంగా ప్రవేశించి గేట్ల తాళాలు పగలగొట్టారని ఫిర్యాదు చేశారు.

అంతేకాదు, వారిని అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి బెదిరించారని ఆరోపించారు. అంతేకాదు, తమ ప్రాంగణంలో నిర్మాణాలు ధ్వంసం చేశారని, ఆ స్థలం తమదేనంటూ టిన్ షీట్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. వారిని అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బంది, కొందరు స్థానికులపై చంద్రశేఖర్ రెడ్డి తదితరులు వారిపై దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికులతోపాటు సెక్యూరిటీ గార్డులను చేతులతో పక్కకు తోసేస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ వ్యవహారంలో ఎవరైనా తలదూర్చితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రాణాలతో వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చారని పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు.

ఆ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఫొటోలను కూడా పోలీసులకు ఫిర్యాదుదారులు అందించారు. అంతేకాదు, తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, మరియు గచ్చిబౌలి ఏసీపీలకు కూడా అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. చంద్ర శేఖర్, తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. చంద్ర శేఖర్ రెడ్డి తదితరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

This post was last modified on September 15, 2026 8:14 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

5 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

6 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

6 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

8 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

10 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

10 hours ago