సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌లది క్రేజీ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘శివమణి’ మంచి విజయం సాధించింది. అప్పట్లో ఆ సినిమాకు వచ్చిన క్రేజే వేరు. రిలీజ్ టైంలో కూడా మంచి హంగామా కనిపించింది. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన ‘సూపర్’కు కూడా బంపర్ క్రేజ్ వచ్చింది. ఐతే ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా రాలేదు.
ఐతే దశాబ్దంన్నరకు పైగా విరామం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా టాలీవుడ్లో ఒక ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. ఇటీవలే పూరి నాగార్జునకు ఒక కథ చెప్పి మెప్పించారని.. త్వరలోనే అది పట్టాలెక్కే అవకాశముందని అంటున్నారు.
నాగ్ కోసం తన శైలికి భిన్నంగా ఒక ఫాంటసీ కథ రాశాడట పూరి. చరిత్రలో వెనుకటి కాలానికి చెందిన ఒక రాజు.. విచిత్ర పరిణామాల మధ్య మళ్లీ ఈ కాలంలోకి అడుగు పెడితే.. తనను తాను ఇప్పటికీ రాజుగానే భావిస్తూ జులుం ప్రదర్శించాలని చూస్తే ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. నాగ్ చరిత్ర, రాజుల తరహా కథల్లో నటించలేదు కానీ.. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో ఈ టైపు ఫాంటసీ అయితే టచ్ చేశారు. కాబట్టి సరిగ్గా వర్కవుట్ చేస్తే నాగ్‌కు ఈ కథ బాగానే సూటయ్యే అవకాశముంది.
నాగ్ ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమా పూర్తి చేసి తర్వాతి సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ‘బంగార్రాజు’ చేస్తాడని.. లేదు లేదు ప్రవీణ్ సత్తారు చిత్రాన్ని ముందు మొదలుపెడతాడని చర్చ నడుస్తోంది. కానీ ఏదీ ఖరారవ్వలేదు. ఐతే పూరితో సినిమా ఓకే అయితే.. వీటిలో ఏదో ఒక సినిమాను ఈ ఏడాది ప్రథమార్ధంలో ముగించేసి, ద్వితీయార్ధంలో ఆ సినిమాను లాగించే అవకాశముంది.
This post was last modified on January 17, 2021 9:13 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…