Movie News

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు నిర్మాతలు డిమాండ్ చేస్తున్నట్టుగా వచ్చిన వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. నాగవంశీ నలభై అయిదు కోట్ల దాకా వచ్చారని అయితే వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ఇంకా చర్చలు కొలిక్కి రాలేదని అంటున్నారు. రేసులో ఇతర డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నప్పటికీ కూలి అనుభవం దృష్ట్యా అంత వేగంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోవచ్చట.

జైలర్ కు మన ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నిజమే. అలాని రికవరీకి అంత సులభంగా గ్యారెంటీ ఇవ్వలేం. యునానిమస్ టాక్ వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ మొత్తం లాగేస్తారు. అందులో అనుమానం లేదు. కానీ ఇక్కడ ముందు వెనుకా చూసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆదర్శ కుటుంబం ఏకె 47 సరిగ్గా వారం ముందు అంటే అక్టోబర్ 9 వచ్చి ఉంటుంది. టీజర్ లో రెండో తేదని అన్నారు కానీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది నాగవంశీకి కీలకమైన ప్రాజెక్టు.

ఆదర్శ కుటుంబంకు పాజిటివ్ టాక్ వస్తే కనీసం రెండు మూడు వారాలు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడుతుంది. దానికి తగ్గట్టే థియేటర్ అగ్రిమెంట్లు చేసుకోవాలి. జైలర్ 2 వచ్చిన మరుసటి రోజే విజయ్ దేవరకొండ రణబాలి ఉంది. ఇది మాట తప్పకపోతే కాంపిటీషన్ టఫ్ అయిపోతుంది. ఇది పీరియాడిక్ డ్రామా. మైత్రి సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తోంది.వీటి మధ్యలో శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ ఉంది. ఇలాంటి వాటిని కూడా గుడ్డిగా తక్కువంచనా వేయడానికి లేదు.

ప్రాక్టికల్ గా చూసుకుంటే జైలర్ 2కి మన దగ్గర సవాళ్లు అయితే ఉన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్ గురించి చెన్నై వర్గాల్లో పాజిటివ్ టాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్ ని క్యామియోకి తీసుకురావడం హిందీ బెల్ట్స్ లో పెద్ద ప్లస్ అవుతుందని టీమ్ భావిస్తోంది. పూర్ణ మీద షూట్ చేసిన స్పెషల్ సాంగ్ ఆల్రెడీ రీచ్ తెచ్చుకున్న నేపథ్యంలో అనిరుధ్ రవిచందర్ అందించే తర్వాతి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఛార్ట్ బస్టర్ స్థాయిలో ఉండాలని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.  

This post was last modified on September 14, 2026 10:39 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

53 minutes ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

1 hour ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

2 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

2 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

3 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

3 hours ago