Movie News

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్ చేసే ధ‌ర‌ల‌కు చాలా వ్య‌త్యాసం ఉంటోంది. చాలా సినిమాల‌కు రైట్స్ అమ్ముడ‌వ‌డం లేదు. ఒక‌సారి డీల్ ఓకే అయ్యాక కూడా రేట్లు మారుతున్న సంద‌ర్భాలు ఉంటున్నాయి. ఈ మ‌ధ్య థియేట్రిక‌ల్ పెర్ఫామెన్సుని బ‌ట్టి కూడా డిజిట‌ల్ హ‌క్కుల రేట్లు నిర్ణ‌య‌మ‌వుతున్నాయి.

థియేట‌ర్ల నుంచి ఇంత క‌లెక్ట్ చేస్తే ఇంత రేటు అని కొన్ని స్లాబ్స్ పెడుతున్నాయి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. ఈ వీకెండ్లో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా అడుగులు వేస్తున్న మండాడి సినిమాకు నిర్మాత ఈ ర‌క‌మైన డీలే చేసుకుని జాక్ పాట్ కొట్టిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

క‌మెడియ‌న్ ట‌ర్న్డ్ హీరో సూరి ప్ర‌ధాన పాత్ర‌లో, సుహాస్ విల‌న్‌గా న‌టించిన మండాడి సినిమాపై నిర్మాత ఎల్రెడ్ కుమార్ రూ.45 కోట్లు ఖ‌ర్చుపెట్టాడు. ఈ సినిమాపై ఇది రిస్కీ బ‌డ్జెటే. దీని ఓటీటీ హ‌క్కుల‌కు నిర్మాత రూ.25 కోట్లు డిమాండ్ చేయ‌గా.. కానీ నెట్ ఫ్లిక్స్ రూ.15 కోట్లే ఇస్తానంద‌ట‌. ఈ విష‌యంలో అంగీకారం కుద‌ర‌క‌.. నిర్మాత‌కు, నెట్‌ఫ్లిక్స్‌కు మ‌ధ్య ఒక డీల్ జ‌రిగిందట‌.

ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ మార్కును ట‌చ్ చేస్తే రూ.30 కోట్లు.. రూ.60-80 కోట్ల మ‌ధ్య వ‌సూళ్లు రాబ‌డితే రూ.40 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జ‌రిగింద‌ట‌. రూ.30 కోట్ల కంటే త‌క్కువ వ‌సూళ్లు రాబడితే రూ.10 కోట్లే ఇచ్చేలా మాట్లాడుకున్నార‌ట‌. ఐతే ఈ సినిమా ఇప్పుడు ఈజీగా రూ.60 కోట్ల మార్కును అందుకునేలా ఉంది. ఫుల్ ర‌న్లో వంద కోట్ల క్ల‌బ్బులోకి కూడా అడుగుపెట్టొచ్చంటున్నారు. బ‌డ్జెట్లో 90 శాతం ఓటీటీ హ‌క్కుల ద్వారా వ‌స్తుండ‌డంతో నిర్మాత జాక్‌పాట్ కొట్టిన‌ట్లే.

మండాడి సినిమాకు త‌మిళంలో పాజిటివ్ రివ్యూలు, టాక్ రాగా.. తెలుగులో మిక్స్డ్ టాక్, రివ్యూలు వ‌చ్చాయి. కానీ సినిమా రెండు చోట్లా అంచ‌నాల‌కు మించి ఆడుతోంది. ఈ చిత్రాన్ని ఒక సినిమా అనుభ‌వం ఉన్న మ‌దిమార‌న్ పుహ‌ళేంది అనే యువ ద‌ర్శ‌కుడు రూపొందించాడు. స‌ముద్రంలో తెర‌చాప ప‌డ‌వ పోటీల నేప‌థ్యంలో న‌డిచే సినిమా ఇది.

This post was last modified on September 14, 2026 10:23 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

1 hour ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

2 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

2 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

2 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

3 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

3 hours ago