Movie News

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ ‘హనుమాన్ అంశ్’ నిలుస్తుండగా కోలీవుడ్ లో ‘మండాడి’ వచ్చేసింది. నిర్మాణంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు మీద విపరీతమైన క్రేజ్ లేదు. సముద్ర నేపథ్యం కాబట్టి ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారనే పాజిటివ్ బజ్ తప్ప జనాల్లో ఎగ్జైట్ మెంట్ తక్కువే. అందులోనూ కమెడియన్ నుంచి ఆర్టిస్టుగా మారిన సూరి హీరో. పరిచయమే లేని తెలుగు నటుడు సుహాస్ విలన్.

కట్ చేస్తే రిలీజైన తర్వాత మండాడి ఊహించని స్పందన దక్కించుకుంటోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 3 లక్షలకు పైగా టికెట్లు బుక్ మై షోలో అమ్ముడుపోవడం పెరుగుతున్న పబ్లిక్ పాజిటివిటీకి నిదర్శనం. తెలుగు డబ్బింగ్ వెర్షన్ చాలా నెమ్మదిగా మొదలయ్యింది. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్, మహేంద్రగిరి వారాహి, సర్దార్ 2 లాంటి పోటీ వల్ల మండాడిని రిలీజ్ రోజు మనోళ్లు లైట్ తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం దాకా పెద్దగా ఆక్యుపెన్సీలు లేని మాట నిజమే. తర్వాత సీన్ మారిపోయింది.

మరీ భీభత్సంగా అని చెప్పలేం కానీ మండాడి అన్ని కొత్త రిలీజులను స్పష్టంగా డామినేట్ చేస్తోంది. షూటింగ్ టైంలో ఓటిటి డీల్ పదిహేను కోట్లు వస్తే నిర్మాత వద్దనుకున్నారు. ఇంకో పది అదనంగా అడిగారు. కానీ కంపెనీ నో చెప్పింది. దీంతో రిస్క్ తీసుకుని రిలీజ్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు నలభై కోట్ల దాకా కేవలం ఓటిటి నుంచే అగ్రిమెంట్ కావొచ్చని చెన్నై మీడియా టాక్. అంటే పెట్టిన బడ్జెట్ లో సగానికి పైగా రికవరీ డిజిటల్ డీల్ లోనే అయిపోతుందన్న మాట.

ఏపీ తెలంగాణలో చాలా చోట్ల స్క్రీన్లు పెంచుతున్నారు. ఎపిక్ తదితర సినిమాల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం మండాడికి ప్లస్ అవుతోంది. సూరి మనకు అంతగా పరిచయం లేని నటుడే అయినప్పటికీ సుహాస్ పాత్ర, కాన్సెప్ట్ చెప్పిన విధానం, ఎమోషన్స్, జివి ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జనాలకు ఎక్కేస్తున్నాయి. ఎక్కువ లెన్త్ లేకుండా రెండున్నర గంటలలోపే సినిమాని క్లోజ్ చేయడం విసుగు లేకుండా చేసింది. మనకు ఇరుముడి లాగా మండాడి మెరుపుదాడిని ఎవరూ ఊహించలేదన్నది వాస్తవం.

This post was last modified on September 13, 2026 12:08 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

8 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

9 hours ago