Movie News

సుమంత్ అదే దారిలో వెళ్తే ఎలా

హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు. ప్రస్తుతం సుమంత్ ఇది ఆలోచించాల్సిన టైం వచ్చింది. తాజాగా విడుదలైన మహేంద్రగిరి వారాహికి కాస్త డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్ కూడా ఓ మాదిరిగా లాక్కొచ్చేలా ఉంది కానీ మరీ టీమ్ చెప్పినంత పెద్ద స్థాయిలో కాదు. ఈ సినిమాలో దేవుడి బ్యాక్ డ్రాప్ తో మురారి తరహాలో అమ్మవారి శాపాన్ని తీసుకుని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సమస్య ఏమిటంటే ఇదే దర్శకుడు సంతోష్ తీసిన సుబ్రమణ్యపురం తరహాలోనే ఇప్పుడీ మహేంద్రగిరి వారాహి ట్రీట్ మెంట్ ఉండటం. మొదటి దాంట్లో ఊళ్ళో వాళ్ళు వరసగా ఆత్మహత్య చేసుకుంటే రెండో దాంట్లో ఒక వంశంలో ప్రతి మూడు దశాబ్దాలకు ఒకసారి మరణాలు సంభవించడం. ట్విస్టు ఊహించనట్టే పెట్టారు కానీ మరీ గొప్పగా పేలలేదు. సిద్దు జొన్నలగడ్డ, ఐశ్యర్య రాజేష్ క్యామియోలు ఆశించిన స్థాయిలో మేజిక్ చేయలేకపోయాయి. వరస్ట్ కాకపోయినా బెస్ట్ కూడా అనిపించుకోలేకపోయింది.

ఇక్కడ గుర్తించాల్సింది ఒకటుంది. ఇలాంటి గ్రామీణ నేపధ్యాలతో పదే పదే ఒకే తరహా థ్రిల్లర్లు తీయడం ప్రతిసారి వర్కౌట్ కాదు. విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, శంభాల, ఊరుపేరు భైరవకోన లాంటివి కమర్షియల్ గా బాగా పే చేసిన మాట వాస్తవమే. అలాని జనాలు అవే అవే మళ్ళీ కోరుకుంటున్నారని కాదు. వాళ్లకు ఇంకా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలి. ఇదేంటి పాత ఫార్ములాని పదే పదే వాడుతున్నారనే ఫీలింగ్ కలిగించకూడదు. విభిన్నంగా వెళ్ళాలి.

అలాని సుమంత్ ఒక్కడినే పాయింట్ అవుట్ చేయలేం. ఎందుకంటే మార్కెట్ పూర్తిగా జీరో అయిపోయిందనుకున్న టైంలో మళ్ళీ రావాతో కంబ్యాక్ అయ్యాడు. కాని దాన్ని కొనసాగించే పెద్ద సక్సెస్ దక్కలేదు. అయినా అవకాశాలు ఆగలేదు. పెట్టుబడి పెట్టే నిర్మాతలు వస్తున్నారు. ఒకపక్క సీతారామం లాంటి వాటిలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే ఇంకో వైపు హీరోగా కొనసాగడం అంత ఈజీ కాదు. సుమంత్ ని ఇంకా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి కథల ఎంపిక తగిన జాగ్రత్తలు అయితే అవసరమే.  

This post was last modified on September 13, 2026 12:37 pm

Share

Recent Posts

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

1 hour ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

2 hours ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

3 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

3 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

4 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

4 hours ago