Movie News

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్ ఫ్లిక్స్ తన అఫీషియల్ అప్డేట్స్ లో ఈ సినిమా సెప్టెంబర్ 18 నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రకటించేసింది. అంటే రాబోయే శుక్రవారం నుంచి జనాలు ఇంట్లోనే ఉండి ఎన్నిసార్లయినా చూసుకోవచ్చు. ఓటిటి వాయిదా ఏదైనా ఉంటుందేమోనని ఎదురు చూసిన మూవీ లవర్స్ కి అలాంటి ఛాన్స్ లేదని అర్థమైపోవడంతో ప్రీమియర్ కు రెడీ అవుతున్నారు.

ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది. మొన్న కొత్త రిలీజులు చెప్పుకోదగ్గ సంఖ్యలో వచ్చినా కూడా ఇరుముడి మరీ డౌన్ కాకపోవడం. ప్రధాన కేంద్రాల్లో వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. శనివారం సాయంత్రం, రాత్రి షోలు పలు చోట్ల హౌస్ ఫుల్స్ నమోదు చేయడం షాక్ కలిగించే విషయం. వీక్ డేస్ లో కొంత నెమ్మదించినప్పటికీ మళ్ళీ ఊహించని విధంగా పికప్ కావడం రవితేజ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. ఇక్కడిదాకా అంతా హ్యాపీనే.

ఒకవేళ ఓటిటి స్ట్రీమింగ్ కనక ఇంకో రెండు వారాలు ఆలస్యం అయ్యుంటే ఇరుముడి పొటెన్షియాలిటీ ఇంకాస్త పెరిగేదన్న కామెంట్ ని కొట్టి పారేయలేం. ఎందుకంటే ఇవాళ్టికి కూడా మెయిన్ సెంటర్స్ లో డెఫిషిట్లు పడటం లేదు. బిసి సెంటర్స్ లో కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. కొత్త సినిమాలకు స్పేస్ ఇవ్వడం కోసం చాలా చోట్ల తీసేయాల్సి వచ్చింది కానీ లేదంటే థియేటర్ రన్ ఇంకా దొరికేది. ఒకేసారి అయిదారు రిలీజులు రావడం వల్ల స్క్రీన్లు చాలని పరిస్థితి తలెత్తింది.

నాలుగు వారాల అగ్రిమెంట్ల వల్లే ఇలాంటి సిచువేషన్ వస్తుందని వేరే చెప్పనక్కర్లేదు. రికవరీ కోసం నిర్మాతలు ఈ మోడల్ ని ఎంచుకోవడం ఫ్లాపుల నుంచి కాపాడుతోంది కానీ ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లకు కొంత డ్యామేజ్ కూడా చేస్తోంది. ఏది ఏమైనా నెట్ ఫ్లిక్స్ పంట పండటం ఖాయం. వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు నమోదయ్యేలా ఉన్నాయి. ఫుట్ ఫాల్స్ లో పుష్ప 2నే ఛాలెంజ్ చేసిన ఇరుముడి డిజిటల్ లోనూ అంతకంటే సంచలనాలు చేస్తుందని వేరే చెప్పాలా. 

This post was last modified on September 13, 2026 11:31 am

Share

Recent Posts

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

56 minutes ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

1 hour ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

2 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

2 hours ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

3 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

4 hours ago