Movie News

రామ్ సినిమా తట్టుకుని నిలబడిందే..

ఇంతకుముందులా సినిమాలు వారాలు.. నెలలు ఆడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ కాలం పోయి చాలా ఏళ్లయింది. ఇప్పుడంతా వీకెండ్ ముచ్చటే. తొలి వారాంతంలో, వారంలో ఎంత రాబట్టామన్నదే కీలకం. అలాంటపుడు సినిమాకు మంచి టాక్ రావడం చాలా అవసరం. రిలీజ్ ముంగిట ఎంత హైప్ ఉన్నప్పటికీ.. టాక్ బాలేకుంటే వీకెండ్ వసూళ్లపై చాలా ప్రభావం పడుతుంది.

పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు మాత్రమే బ్రేక్ ఈవెన్ ఛాన్సుంటుంది. ఐతే అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు మాత్రం నెగెటివ్ టాక్‌ను తట్టుకుని నిలబడుతుంటాయి. రివ్యూలు, టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టి సేఫ్ జోన్ వైపు అడుగులు వేస్తుంటాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ సినిమా ‘రెడ్’ కూడా ఈ కోవలోకే చేరేలా ఉంది. ఈ గురువారం సంక్రాంతి పండుగ రోజు విడుదలైన ‘రెడ్’కు యావరేజ్, నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా ఏమంత గొప్పగా కనిపించలేదు.

కానీ ఈ సినిమాకు రివ్యూలు, టాక్ పెద్దగా ప్రభావం చూపనట్లే కనిపిస్తోంది. తొలి రోజు అంచనాల్ని మించి పెర్ఫామ్ చేసిన ఈ చిత్రం రూ.6.5 కోట్ల షేర్ రాబట్టింది. రెండో రోజు కూడా రూ.3 కోట్ల దాకా షేర్ వచ్చింది. శనివారం లెక్కలు తేలాల్సి ఉంది. ఆ రోజు కూడా సినిమా మంచి ఆక్యుపెన్సీతో రన్ అయింది. సినిమా ఓవరాల్‌గా ఎలా ఉన్నప్పటికీ మాస్ మెచ్చే అంశాలకు లోటు లేకపోవడం, రామ్ పెర్ఫామెన్స్, హెబ్బా పటేల్ ఐటెం సాంగ్, కొన్ని ఎపిసోడ్లు సినిమాకు కలిసొచ్చినట్లే ఉన్నాయి.

వాటితో ఓ వర్గం ప్రేక్షకులు సంతృప్తి చెందినట్లే ఉన్నారు. ఇక సంక్రాంతి సినిమాల్లో అత్యుత్తమ థియేటర్లు దక్కింది ‘రెడ్’కే. స్రవంతి రవికిషో‌ర్‌కు ఉన్న పేరు, పలుకుబడి బాగానే ఈ చిత్రానికి ఉఫయోగపడ్డట్లున్నాయి. ‘క్రాక్’తో పోలిస్తే వసూళ్లు తక్కువే కానీ.. దానికి దీటుగా థియేటర్లు మాత్రం ఉన్నాయి. దాంతో పోలిస్తే మంచి సెంటర్లలో, మంచి థియేటర్లు ఉన్నాయి.

ఇది సినిమాకు బాగా కలిసొస్తున్నట్లు ఉంది. వీకెండ్ అయ్యే లోపు ‘రెడ్’ బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసినట్లే అంటున్నారు. శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ హక్కులతోనే ‘రెడ్’కు పెట్టుబడి వెనక్కి వచ్చేయగా.. థియేట్రికల్ హక్కులతో వచ్చేదంతా లాభమే. ఐతే సినిమాను ఓ మోస్తరు రేట్లకే అమ్మడం డిస్ట్రిబ్యూటర్లకు కలిసొస్తోంది.

This post was last modified on January 17, 2021 9:06 pm

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

4 hours ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

5 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

5 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

7 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

8 hours ago