ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చిరాకు వచ్చిన గ్రామస్తులు ఏకంగా ఏం చేశారో తెలుసా..? రెండేళ్లుగా 5జీ సిగ్నల్ సరిగ్గా రావడం లేదని ఆగ్రహించి నెట్‌వర్క్ సమస్యను పరిశీలించేందుకు వచ్చిన జియో టెక్నీషియన్‌ను మొబైల్ టవర్‌కు కట్టేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా హరదౌలి గ్రామంలో చోటుచేసుకుంది. నెట్‌వర్క్ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పరిష్కారం లభించలేదని గ్రామస్థులు ఆరోపించారు.
హరదౌలి గ్రామంలో రెండేళ్లుగా 5జీ సేవలు సక్రమంగా అందడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆన్‌లైన్ తరగతులు, డిజిటల్ చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. సమస్యను పరిశీలించేందుకు జియో టెక్నీషియన్ గ్రామానికి రావడంతో అతడిని పట్టుకున్న గ్రామస్థులు టవర్‌కు కట్టేసినట్లు సమాచారం.
దాదాపు రెండు గంటల పాటు టెక్నీషియన్ అక్కడే ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అతడిని విడిపించారు. అనంతరం టెక్నీషియన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిని 5 జీ రెవల్యూషన్ అని సోషల్ మీడియాలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on September 12, 2026 9:21 am
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను తన రాజకీయ వారసురాలిగా…
నిర్మాత బన్నీ వాస్ ఇవాళ జరిగిన ఇడుపు కాగితం సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఏఐ గురించి మాట్లాడుతూ రాబోయే…
రాను రాను సోషల్ మీడియా మరీ టాక్సిక్ అవుతోందని కొందరు సినీ ప్రముఖులు చెప్పే మాట నిజమే అనిపిస్తుంది. జైలర్…
విశ్వక్ సేన్ కల్ట్ అక్టోబర్ 30 విడుదలకు రెడీ అవుతోంది. ఆదర్శ కుటుంబంతో పోటీ ఎందుకు లెమ్మని ఇట్లు అర్జున,…
జైలర్ 2, రణబాలి లాంటి క్రేజీ సినిమాలతో పోటీ పడి చాలా పెద్ద రిస్కు చేసిన గరివిడి లక్ష్మి రికార్డులు…
ఏపీలో మొత్తం 19 చోట్ల నామినేషన్ల గడువు పొడిగించాలని సుప్రీం కోర్టును వైసీపీ ఆశ్రయించింది. అయితే, కేవలం 4 స్థానాల్లో…