Movie News

సోనూ సూద్ తెలుగు ప్రేమ

సోనూ సూద్‌ను ఇప్పుడెవరూ ఒక భాష వాడిగా, ఒక ప్రాంతం వాడిగా చూడట్లేదు. కరోనాకు ముందు అతను వేరు, అది వచ్చాక అతను వేరు. దేశం తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో ఎంతోమంది అభాగ్యులకు సాయం చేసి రియల్ హీరోగా నిలిచాడతను. ఇప్పుడు సోనూ ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు వారు కూడా అందుకు మినహాయింపు కాదు. సోనూ సాయం అందుకున్న వాళ్లు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు.

కరోనా విరామం తర్వాత అతను తిరిగి షూటింగుల్లో పాల్గొంటోంది తెలుగు చిత్రాలతోనే. ముందు ‘అల్లుడు అదుర్స్’ చిత్రాన్ని పూర్తి చేసిన అతను.. ఆ తర్వాత ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. సోనూ షూటింగ్‌కు హాజరైనపుడు.. ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ రిలీజ్ సందర్భంగా సోనూకు తెలుగువారి నుంచి వస్తున్న స్పందన అపూర్వం. ‘అల్లుడు అదుర్స్’లో హీరో ఇంట్రో కంటే సోనూ తొలిసారి తెరపై కనిపించినపుడే ఎక్కువ స్పందన వస్తోంది ప్రేక్షకుల నుంచి.

సోనూ సూద్ సైతం తెలుగువారిపై తన ప్రత్యేక ప్రేమను దాచుకోలేదు. తెలుగు సినిమా, తెలుగు జనాలు తనకెంత ప్రత్యేకమో అతను ‘అల్లుడు అదుర్స్’ సక్సెస్ మీట్లో వివరించాడు. తాను హిందీ, తెలగు, తమిళ భాషల్లో సినిమాలు చేశానని.. ఇలా ఎన్ని భాషల్లో నటించినా తన ఫస్ట్ లవ్ మాత్రం తెలుగే అని.. ఈ విషయాన్ని తాను ఎప్పుడూ చెబుతూనే ఉంటానని సోనూ అన్నాడు.

తాను సినిమాలకు సంబంధించి నేర్చుకున్నదంతా తెలుగు పరిశ్రమ నుంచే అని.. తనపై ఇక్కడి జనాలు చూపించే ప్రేమకు కృతజ్ఞుడనని.. తన భార్య కూడా తెలుగు అమ్మాయే అని.. కాబట్టి తాను ఇక్కడి వాడినే అని భావిస్తానని.. తెలుగు వారంటే తనకు కుటుంబంతో సమానం అని ఎంతో ఉద్వేగంతో చెప్పాడు సోనూ. ఈ వ్యాఖ్యలకు మన వాళ్ల నుంచి మంచి స్పందన వస్తోంది. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో చాలామంది షేర్ చేస్తున్నారు.

This post was last modified on January 17, 2021 3:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

11 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

30 minutes ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

45 minutes ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

1 hour ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago