Political News

అధికారులెందుకు బాబు సహనాన్ని పరీక్షిస్తున్నారు?

సీఎం చంద్రబాబు పరిపాలన గురించి, పాలనపై ఆయనకు ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే పని రాక్షసుడు అని కొందరు అధికారులు చంద్రబాబు గురించి చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశ్యంతో చంద్రబాబు నిద్రపోరు…అధికారులను నిద్ర పోనివ్వరు అన్న పేరుంది. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుపరిపాలన అందించేందుకు అధికారులతో కచ్చితంగా పనిచేయించాలన్నదే చంద్రబాబు ఆలోచన.

ఆ క్రమంలోనే కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు, టెలీకాన్ఫరెన్స్ లు నిర్వహించడం…వారి పనితీరును స్వయంగా పర్యవేక్షించడం ఆయనకు అలవాటు. అయితే, కొందరు అధికారులు మాత్రం గంటల తరబడి సమీక్షల్లో ఎక్కడ కూర్చుంటాం అన్న రీతిలో వ్యవహరిస్తూ మీటింగులకు ఏవో కారణాలు, సాకులు చెప్పి డుమ్మా కొడుతుంటారు.

ఈ క్రమంలోనే అటువంటి అధికారులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రివ్యూ మీటింగ్ ఉన్నప్పుడు ఇక్కడే ఉండాలని, 12 గంటల పాటు కూర్చోలేకపోతే వాళ్లెందుకు? అని అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ కు ఫోన్ కూడా తేవద్దని చెప్పానని, మీటింగ్ లో విషయాలపై ఫోకస్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే అలా చెప్పానని అన్నారు. కానీ, కొందరు అధికారులు తమాషాలాడుతున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రోజు చంద్రబాబు నిర్వహించిన రివ్యూ మీటింగ్ కు కొందరు ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే వారికి ఎంత ధైర్యం? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. వారేమనుకుంటున్నారు అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు, మంత్రులు సంబంధింత శాఖాధికారులు మీటింగ్ కు వచ్చేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కేవలం సీఎస్, కలెక్టర్లపై నెట్టేస్తే సరిపోదని, ఉన్నత అధికారులంతా బాధ్యతగా వ్యవహరించి మీటింగులకు రావాలని ఆదేశించారు. భవిష్యత్తులో అందరు అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని యోచిస్తున్నానని, అందరూ ఒక టీం అనే భావనతో పనిచేస్తేనే పరిపాలన సజావుగా సాగుతుందని అన్నారు.

This post was last modified on September 11, 2026 11:47 pm

Share

Recent Posts

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

46 seconds ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

2 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

4 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

4 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

6 hours ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

7 hours ago