Movie News

హీరోయిన్ని వెంటాడిన దుల్కర్ డిజాస్టర్

కొన్ని సినిమాల ఫెయిల్యూర్లు కొందరు కెరీర్ల మీద తీవ్ర ప్రభావమే చూపిస్తుంటాయి. ఒక మూవీలో చాలామంది భాగం అయినా.. కొందరి మీదే ఎక్కువ ప్రభావం ఉంటుంది. తన కెరీర్లో ‘కింగ్ ఆఫ్ కోథా’ సినిమా డిజాస్టర్ కావడం తనను చాలా ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టినట్లు కథానాయిక ఐశ్వర్య లక్ష్మి చెప్పింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ఈ మలయాళ చిత్రం 2023లో భారీ అంచనాల మధ్య రిలీజైంది.

దుల్కర్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ (రూ.50 కోట్లు), భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఇది. కానీ బ్యాడ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత తాను విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నానని.. మానసికంగా కూడా తనను దెబ్బ తీసే స్థాయికి అది చేరుకుందని ఐశ్వర్య చెప్పింది. ఒక దశలో దుల్కర్‌తో మళ్లీ కలిసి పని చేసే అవకాశం వచ్చినా, ట్రోలింగ్‌కు భయపడి ఆ ఛాన్స్ వదులుకున్నట్లు ఆమె తెలిపింది.

‘‘కింగ్ ఆఫ్ కోథా తర్వాత నాకు అవకాశాలు ఇవ్వడానికి మలయాళ పరిశ్రమ భయపడినట్లు అనిపించింది. ఈ సినిమాలో భాగమైన అందరినీ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. నా నటన, డైలాగ్ డెలివరీ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. కొన్నిసార్లు నాక్కూడా ఆ విమర్శలు నిజమేనా అనిపించేది. నేను అందులో హీరోను రాజువెట్టా అని పిలుస్తాను. నన్ను ట్రోల్ చేయడానికి ఆ మాటనే వాడేవారు.

చివరికి ఇండస్ట్రీలో జనాలు కూడా ఆ మాట వాడి నన్ను ఎగతాళి చేశారు. ఒక సినిమా షూటింగ్ టైంలో సెట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను ఆ మాటతో ఏడిపించే ప్రయత్నం చేశాడు. చాలా బాధ పడ్డాను. తర్వాత దుల్కర్‌తో ఒక యాడ్ చేసే అవకాశం వచ్చింది. కానీ నాతో అతను కలిసి నటిస్తే మళ్లీ ట్రోల్ చేస్తారనే భయంతో ఆ ఛాన్స్ వదులుకున్నా. దుల్కర్‌కు కూడా ఇదే మాట చెప్పా. కింగ్ ఆఫ్ కోథా ట్రోల్స్ నన్ను ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టాయి’’ అని ఐశ్వర్య చెప్పింది. ఐశ్వర్య ప్రస్తుతం తెలుగులో సాయిధరమ్ తేజ్ సరసన ‘సంబరాల యేటి గట్టు’ చిత్రంలో నటిస్తోంది.

This post was last modified on September 9, 2026 3:31 pm

Share

Recent Posts

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

58 minutes ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

1 hour ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

1 hour ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

2 hours ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

2 hours ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

6 hours ago