నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్ల డ్రెస్ లు ధరించి అసెంబ్లీకి వచ్చారు. కానీ, నల్ల దుస్తులతో సభలోకి అనుమతి లేదని వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బీఆర్ఎస్ భవన్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుకు నిరసనగా హరీశ్ రావు, సుధీర్ రెడ్డి, వివేకానందరెడ్డితో పాటు పలువురు నేతలు తమ టీ షర్టులు విప్పేసి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్ ధరిస్తే తప్పు లేనప్పుడు తాము ధరిస్తే తప్పేంటని హరీశ్ రావు ప్రశ్నించారు.
అంతకుముందు, పోలీసుల తోపులాట సందర్భంగా హరీశ్ రావు కిందపడిపోయారు. ఆ సందర్భంగా పోలీసులు హరీశ్ రావు చేతిని తొక్కుతూ అమానుషంగా ప్రవర్తించారని పోలీసులపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ తోపులాటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కింద పడిపోయారు. ఆయన కాలికి గాయమైంది.
This post was last modified on September 7, 2026 11:50 am
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…
ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…
కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…
సైబర్ నేరాల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు సహా రిజర్వ్ బ్యాంకు…
చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత…
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…