కెరీర్ ఆరంభంలో ట్రెడిషనల్ ముద్ర పడితే హీరోయిన్లకు చాలా కష్టమైపోతుంది. హీరోయిన్లకు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు ఎప్పుడో కానీ రావు. గ్లామర్ టచ్ ఇవ్వకుంటే కెరీర్ ఊపందుకోదు. ఈషా రెబ్బా లాంటి భామలు ముందు ట్రెడిషనల్ ముద్ర వేయించుకుని ఆ తర్వాత తమలోని గ్లామర్ కోణాన్ని ఎలివేట్ చేయడానికి ఎంతగా కష్టపడుతున్నారో తెలిసిందే. చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రుహాని శర్మ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఆ సినిమాలో ఆమె చక్కటి నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమా మంచి విజయం కూడా సాధించింది. కానీ రుహానికి పెద్దగా అవకాశాలు రాలేదు. కొత్త సినిమాల కోసం ఎదురు చూపులు ఫలించకపోవడంతో రుహాని కూడా రూటు మార్చింది.
ఈ మధ్య రుహాని ఫొటో షూట్లన్నీ హాట్ హాట్‌గానే ఉంటున్నాయి. ఇటీవలే విడుదలైన డర్టీ హరి సినిమాలోనూ ఆమెది ట్రెడిషనల్ క్యారెక్టరే కానీ లిప్ లాక్, రొమాంటిక్ సీన్లతో కుర్రాళ్లలో బాగానే వేడి పుట్టించింది. ఈ సినిమాలో సిమ్రత్ కౌర్‌యే ఎక్కువ హైలైట్ అయినప్పటికీ రుహాని కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పుడు రుహాని చేసిన లేటెస్ట్ ఫొటో షూట్ కూడా ఆమెలోని హాట్ కోణాన్ని ఎలివేట్ చేసేదే. గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందచందాలు.. అప్పీయరెన్స్ తన సొంతమని రుహాని చెప్పకనే చెబుతోంది తన కొత్త ఫొటో షూట్‌తో. రుహాని త్వరలోనే ఆగ్రా అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెడుతుండటం విశేషం. మరోవైపు అవసరాల శ్రీనివాస్ సరసన రుహాని నటిస్తున్న నూటొక్క జిల్లాల అందగాడు పూర్తి కావడంలో ఆలస్యం జరుగుతోంది.
This post was last modified on January 16, 2021 9:22 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…