సంక్రాంతికి ముందుగా బరిలోకి దిగిన సినిమానే ఈ సీజన్ విజేతగా నిలిచింది. పండక్కి ఐదు రోజుల ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ రాజా రవితేజ సినిమా ‘క్రాక్’యే సంక్రాంతి విజేత అనడంలో మరో మాట లేదు. టాక్, వసూళ్లు.. దేని పరంగా చూసుకున్నా ఈ చిత్రమే ముందంజలో ఉంది. బుధ, గురు వారాల్లో విడుదలైన మూడు సినిమాల వల్ల ‘క్రాక్’ కొంచెం జోరు తగ్గించినట్లు కనిపించింది కానీ.. వాటి టాక్ తేడా కొట్టడంతో మళ్లీ ఈ సినిమా పుంజుకుంది.
ఇప్పుడు థియేటర్లలో ఎక్కువ సందడి కనిపిస్తున్నది ‘క్రాక్’ చిత్రానికే. వీకెండ్లో ఈ చిత్రం భారీ వసూళ్లే రాబట్టేలా ఉంది. ఐతే థియేటర్లలో ఇంత బాగా ఆడుతున్న ఈ చిత్రం ఈ నెలలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతోందంటూ వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
‘క్రాక్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆహా’ వారు ఓ సినిమాపై పెట్టిన అత్యధిక పెట్టుబడి ఇదే. అందులో రిలీజవుతున్న అతి పెద్ద సినిమా కూడా ‘క్రాక్’యే. ఐతే థియేటర్లలో రిలీజైన నెలలోనే డిజిటల్ రిలీజ్ చేసుకునేలా ఒప్పందం కుదిరిందట. ఈ నెల 29న ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమ్ చేయబోతున్నారట.
ఈ మేరకు ఓటీటీలో కొత్త సినిమాల అప్ డేట్లు ఇచ్చే ట్విట్టర్ హ్యాండిల్స్‌లో పోస్టులు కనిపిస్తున్నాయి. కొందరు పీఆర్వోలు కూడా వీటిని రీట్వీట్ చేశారు. కానీ అంతలో ఆ ట్వీట్లను డెలీట్ చేశారు. ఇంకో రెండు వారాల్లోపే డిజిటల్లో రిలీజవుతుందని తెలిస్తే జనాలు థియేటర్లకు రావడం మానేస్తారని.. థియేటర్లలో బాగా ఆడుతున్న సినిమాను చంపేసినట్లు అవుతుందని.. బాక్సాఫీస్ రన్ పూర్తయ్యే వరకు డిజిటల్ రిలీజ్ గురించి సమాచారం షేర్ చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ ట్వీట్లు డెలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక వారం తర్వాత దీని గురించి అధికారిక అప్ డేట్ బయటికి రావచ్చేమో. 29నే సినిమా డిజిటల్లో రిలీజైతే ఆశ్చర్య పడాల్సిన పని లేదు.
This post was last modified on January 16, 2021 9:20 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…