బాలీవుడ్లో చాన్నాళ్ల నుంచి చర్చల్లో ఉన్న పెళ్లి అంటే రణబీర్ కపూర్-ఆలియా భట్‌లదే. కరోనా-లాక్ డౌన్ లేకుంటే గత ఏడాదే తమ పెళ్లి జరిగేదని.. ఈ ఏడాది కచ్చితంగా తాను, ఆలియా పెళ్లి చేసుకుంటామని రణబీర్ ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే రణబీర్ పెళ్లి ముహూర్త ఎప్పుడో ఏమో కానీ.. ఈలోపు మరో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా తాను ప్రేమిస్తున్న నటాషా దలాల్‌నే వరుణ్ పెళ్లాడబోతున్నాడు. ఇరు కుటుంబాల అంగీకారం వీరి పెళ్లి ఈ నెల 24నే జరగబోతోంది.
ముంబయిలోని అలీ బాగ్‌లో ఒక పెద్ద రిసార్ట్‌ను పూర్తిగా వరుణ్, నటాషాల పెళ్లి కోసం బుక్ చేశారు. కరోనా ప్రభావం ఇంకా కొనసాగబోతున్న నేపథ్యంలో ఈ పెళ్లికి అతిథుల సంఖ్య పరిమితంగా ఉండబోతోంది. ఇరు కుటుంబాలకు చెందిన వంద మంది అతిథులకు మించి పెళ్లిలో ఉండబోరట. మూడు రోజుల పాటు పెళ్లి వేడుక సాగనుంది.
ఐతే బాలీవుడ్ నుంచి వరుణ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సల్మాన్ ఖాన్‌తో పాటు కత్రినా కైఫ్, మరికొందరు ఈ పెళ్లికి హాజరు కానున్నారు. బాలీవుడ్ సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ కొడుకైన వరుణ్ ధావన్.. 2012లో కరణ్ జోహార్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఆ సినిమా అతడికి మంచి ఆరంభాన్నే ఇచ్చింది. ఆ తర్వాత మై తేరా హీరో, బద్లాపూర్, ఏబీసీడీ-2, బద్రీనాథ్ కి దుల్హానియా, జుడ్వా-2 అక్టోబర్ లాంటి హిట్లు వరుణ్‌కు మంచి పేరు తెచ్చాయి. అతడికి స్టార్ ఇమేజ్ కూడా తీసుకొచ్చాయి.
వరుణ్ ఇటీవలే ‘కూలీ నంబర్ వన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. 90ల్లో ఇదే పేరుతో విడుదలైన సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ అమేజాన్ ప్రైమ్‌లో వ్యూస్ మాత్రం భారీగానే వచ్చాయి. నటాషాతో దాదాపు నాలుగేళ్లుగా వరుణ్ డేటింగ్ చేస్తున్నాడు. చివరికి ఆమెనే అతను పెళ్లి చేసుకుంటున్నాడు.
This post was last modified on January 16, 2021 2:12 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…