Movie News

బుల్లితెర కాలక్షేపానికి ఢోకా లేదు

ఈ వారం థియేటర్లో కొత్త రిలీజులు అరడజను పైనే ఉన్నాయి. స్ట్రెయిట్, డబ్బింగ్ అన్నీ కలిపి వాటి వాటి స్థాయిలో ప్రమోషన్లు చేసుకుని ఆడియన్స్ ని మెప్పించేందుకు రెడీ అయ్యాయి. అయితే అక్కడిదాకా వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వినోదాన్ని కోరుకునే ఓటిటి ఫ్యాన్స్ కి కూడా ఏ ఢోకా లేకుండా బోలెడు ఎంటర్ టైన్మెంట్ ని అందుబాటులోకి తెచ్చారు. ఈ మధ్య ఓటిటిలో కూడా అయితే అతివృష్టి లేదా అనావృష్టిగా పరిస్థితి మారిపోయింది. కంటెంట్ చూస్తే మీకే అర్థమవుతుంది.

వరుణ్ తేజ్ కి మంచి కంబ్యాక్ గా నిలిచిన ‘కొరియన్ కనకరాజు’ కేవలం ఇరవై ఎనిమిది రోజుల విండోతో బుల్లితెరపైకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ మంచి మొత్తం ఇచ్చి కొనుగోలు చేసింది. యాభై కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిన ఈ హారర్ డ్రామాని అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులో ఉంచారు. ఊహించని విధంగా సర్ప్రైజ్ హిట్టు కొట్టిన ‘డిసి’ని సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్ చేస్తోంది. లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి జంటగా నటించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ తమిళంలో కంటే తెలుగులో బాగా ఆడింది.

మాధవన్ నటించిన రియల్ లైఫ్ బయోపిక్ ‘జిడిఎన్’ థియేటర్లలో ఆదరణకు నోచుకోలేదు. గొప్ప వ్యక్తి జీవిత కథే అయినప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు అంత మెప్పించేలా లేకపోవడంతో ప్యాన్ ఇండియా భాషల్లో ఫ్లాప్ అయ్యింది. అయితే విమర్శకులు ఈ మూవీని కొట్టి పారేయలేదు. ట్రై చేయొచ్చనే రికమండ్ చేశారు. తాప్సి నటించిన ‘గాంధారి’తో పాటు మలయాళం మూవీ ‘ఉన్మాదం’ రెండూ తెలుగు డబ్బింగ్ తో పాటు అందుబాటులోకి వచ్చాయి.

ఇవి కాకుండా ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో సుస్మిత కొణిదెల నిర్మించిన ‘జగమే సంగీతం’, బాలీవుడ్ నుంచి ‘ధమాల్ 4’ తో పాటు రెండు రోజుల క్రితం అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ‘పళ్ళబురుసు’ గుట్టు చప్పుడు కాకుండా ఓటిటిలో వచ్చేశాయి. సో కావాల్సినంత ఓపిక తీరిక ఉండాలి కానీ కాలు కదిపే అవసరం లేకుండా ఇన్నేసి ఆప్షన్లు తెచ్చి పెట్టారు. అయినా థియేటర్లకు కాంపిటీషన్ అన్నట్టు ఓటిటిలు కూడా తమ రిలీజులకు శుక్రవారం కాకుండా ఇంకో రోజు స్ట్రీమింగ్ పెట్టుకుంటే బెటరేమో. 

This post was last modified on September 4, 2026 11:41 am

Share

Recent Posts

రాకా గురించి సడెన్ డిస్కషన్లేంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త చిత్రం ‘రాకా’ను అభిమానులు కోరుకున్నట్లుగా ప్రమోట్ చేయట్లేదనే కంప్లైంట్ ఉంది. ఈ…

1 hour ago

ఈవెంట్లకే రాని నయన్ థియేటర్ విజిట్ చేసిందా?

సౌత్ ఇండియన్ సినిమాలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన అతి కొద్ది మంది కథానాయికల్లో నయనతార ఒకరు. ఒక వైపు…

2 hours ago

నేపాల్ వరదల్లో చిక్కుకొని… 9 రోజుల తర్వాత బయటకు…

నేపాల్ వరదలు సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వేలాది మంది పౌరులు, పాఠశాల విద్యార్థులు గల్లంతయ్యారు. రోజులు గడుస్తున్నా…

2 hours ago

దమ్ముంటే పరకాలలో పోటీచేయాలి – సుస్మిత సవాల్

కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ పార్టీని ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత ఆమె కూతురు…

3 hours ago

తాప్సి ఎంత కొత్తగా ట్రై చేసినా

ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్, దరువు లాంటి సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న తాప్సి కొన్నేళ్లుగా పూర్తిగా బాలీవుడ్ కే…

4 hours ago

జడల్ విలన్లని సరిగా వాడుకోవాలి

ఇంకో 22 రోజుల్లో ప్యారడైజ్ ఆగమనం జరగనుంది. వచ్చే వారం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టనుండగా తెలుగు రాష్ట్రాల్లో జీవోలు,…

5 hours ago