‘ఖైదీ’ సినిమాలో హీరోయినే లేకుండా, హీరో నేపథ్యం ఏమిటనేది చెప్పకుండా కేవలం తన డైరెక్షన్ స్కిల్స్తో ప్రేక్షకులను కట్టి పడేసి కమర్షియల్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ సూపర్‍స్టార్ విజయ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడంటే కచ్చితంగా చాలా కొత్త రకం సినిమా ఇస్తాడని భావించారు. తన మార్కు తెలిసేలా నేపథ్యమయితే ఎంచుకున్నాడు కానీ విజయ్ ఇమేజ్‍ను దాటి ప్రయోగం చేయడానికి లోకేష్ సాహసించలేకపోయాడు.
విజయ్‍ను ఫాన్స్ ని మెప్పించే విధంగా చూపించడం కోసమని అతను కాంప్రమైజ్ అయిపోవడంతో ‘మాస్టర్’ మూస సినిమాగా మిగిలిపోయింది. లోకేష్ లాంటి క్రియేటివ్ దర్శకులు కూడా సూపర్‍స్టార్ల ఇమేజ్‍కి దాసోహమని లొంగిపోతే ఇక పెద్ద స్టార్లతో కొత్త సినిమాలెలా వస్తాయి. అలాగే పెద్ద హీరోలను ప్రేక్షకులు చూసే దృష్టి ఎలా మారుతుంది. ప్రయోగాత్మక కథలన్నీ చిన్న సినిమాలకే పరిమితం కావాల్సి వస్తుంది. తదుపరి చిత్రాన్ని కమల్‍హాసన్‍తో తీయాలని లోకేష్ ముందే ఫిక్స్ అయిపోయాడు.
విజయ్ తర్వాత మరో పెద్ద స్టార్ కావాలంటూ కూర్చోకుండా ‘విక్రమ్’ అంటూ అరవై ఆరేళ్ల కమల్‍తో సినిమా చేయడంతోనే తాను స్టీరియోటైప్ కాదని, తనకు డిమాండ్‍లో వున్న టాప్ హీరోల సినిమాలు మాత్రమే చేయాలనే యోచన లేదని తేల్చేసాడు. విక్రమ్‍తో అయినా ఖైదీ లోకేష్ తిరిగి తెరపై కనిపిస్తాడని సినీ ప్రియులు ఆశ పడుతున్నారు.
This post was last modified on January 16, 2021 12:00 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…