Movie News

ఆగస్ట్ నెల… టాలీవుడ్ కళకళ

జూన్ ముందు రెండు మూడు నెలలు సరైన సినిమాలు లేక, జనాలు థియేటర్ల వైపు చూడక ఎగ్జిబిటర్లు అల్లాడిపోయారు. మధ్యలో కొన్ని యావరేజులు వచ్చాయి కానీ అవేవి రోజుల తరబడి ఫుల్స్ చేసేందుకు సరిపోలేదు. పెద్ది నుంచి సీన్ మారిపోయింది. నెలకు కనీసం రెండు మూడు హిట్లతో బాక్సాఫీస్ కళకళలాడింది. ఆ సంతోషాన్ని ఆగస్ట్ రెట్టింపు చేసిందని చెప్పాలి. పరీక్షల సీజన్ కాకపోవడంతో పాటు సెలవులు ఎక్కువ రావడంతో కలెక్షన్ల పరంగా చాలా ప్లస్ అయ్యింది.

వరుణ్ తేజ్ కు భరోసా ఇస్తూ కొరియన్ కనకరాజు యాభై కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడం మెగా ఫ్యామిలీని సంతోషంలో ముంచెత్తింది. దారుణమైన డిజాస్టర్ల పర్వానికి బ్రేక్ వేయడం మెగా ప్రిన్స్ కి కొత్త జోష్ ఇచ్చింది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా డిసి తెలుగు రాష్ట్రాల్లో హిట్ కావడం ఊహించని ట్విస్టు. రోజుకు రెండు మూడు షోలు చాలనుకుంటే క్రమంగా వాటిని పెంచాల్సిన పరిస్థితి ఏ సెంటర్లలో కలిగింది. వారంకి పైగా స్థిరంగా ఉండటం బయ్యర్లను హ్యాపీ చేసింది.

ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ మరో కిక్. తమిళం కన్నా మన దగ్గరే మెరుగ్గా పెర్ఫార్మ్ చేసి రెండు వారాలకు పైగా స్టడీగా ఉండటం సూర్యకు వరసగా రెండో హిట్టు ఇచ్చింది. కంటెంట్ మీద కామెంట్స్ ఎన్ని ఉన్నా హుషారు పిట్టలు లాంటివి దాని బడ్జెట్ కు తగ్గట్టు కాసిన్ని లాభాలు ఇచ్చాయి. నాగార్జున ముందుండి ప్రమోట్ చేసిన పళ్ళబురసు, తెలంగాణ నేటివిటీ మీద ప్రమోట్ చేసుకున్న అమీర్ లోగ్ లాంటివి దారుణంగా పోయాయి. ఇక అన్నింటికన్నా పెద్ద గిఫ్ట్ ఆగస్ట్ 21 దక్కింది.

ఇరుముడితో పెద్దా చిన్న తేడా లేకుండా అన్ని చోట్లా వసూళ్ల మోత మ్రోగుతూనే ఉంది. రెండు వందల కోట్ల మార్కుని అందుకోవడానికి రవితేజ పరుగులు పెడుతున్న తీరు చూసి ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. కాకపోతే టాక్సిక్ ఈ జోష్ ని కొనసాగిస్తుందనుకుంటే ఊహించని విధంగా డిజాస్టర్ కావడం పంపిణీదారులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కెజిఎఫ్ స్థాయిలో ఎక్స్ పెక్ట్ చేస్తే అందులో కనీసం పావు వంతు కూడా అందుకోలేకపోవడం ఒక్కటే ఈ నెలలో చూసిన ట్రాజెడీ. 

This post was last modified on August 31, 2026 10:43 pm

Share

Recent Posts

SRH బౌలింగ్‌లో భారీ మార్పులు.. CSKతో డీల్?

ఐపీఎల్ 2027 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి…

9 minutes ago

శ్రీలీల.. పెద్ద షాకే ఇవ్వ‌బోతోంది

కొన్ని రోజుల ముందు వ‌ర‌కు శ్రీలీల ప‌నైపోయిందంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ న‌డిచింది. తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.…

49 minutes ago

ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నారు.. ఆర్భాటాలు వ‌ద్దు..

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కూట‌మి పార్టీలు ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్నాయి. దాదాపు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో కూట‌మి పార్టీలే…

1 hour ago

హ‌మ్మ‌య్య నిలిచాం.. జ‌గ‌న్‌కు ఇదొక్క‌టే మిగిలిందా.. ?

పార్టీ ప‌రంగా గెలుపు ఓట‌ములు ఎలా ఉన్నా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే గొప్ప అనేలా వైసీపీ వ్య‌వ‌హారం ఉందా?…

2 hours ago

పులివెందులలో మరీ ఇంత దారుణంగా ఓడిపోయిందా?

రాష్ట్రం మొత్తంలో వైసీపీ ప‌రిస్థితి, జ‌గ‌న్ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. త‌మ‌కు పుట్టిల్ల‌యిన‌.. పులివెందుల‌లో మాత్రం ఒక ప్ర‌తిష్టాత్మ‌కం. అందుకే…

2 hours ago

ఈఎన్ఈ-3.. వ‌ద్దే వ‌ద్దు అనేసిన ద‌ర్శ‌కుడి త‌ల్లి

ఈ న‌గ‌రానికి ఏమైంది.. పెళ్ళిచూపులుతో సెన్సేష‌న్ క్రియేట్ చేశాక త‌రుణ్ భాస్క‌ర్ తీసిన సినిమా. ఎనిమిదేళ్ల కింద‌ట ఈ చిత్రం…

3 hours ago