డిసెంబర్ 24 పోటీ రసవత్తరంగా మారుతోంది. కింగ్ 100 ఆల్రెడీ ఆ డేట్ ని తీసుకోగా తాజాగా బాలయ్య 111 సైతం అదే తేదీకి రావాలని నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిం నగర్ అప్డేట్. సెప్టెంబర్ 6 కొత్త టీజర్ లేదా పోస్టర్ తో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే నాగార్జున, బాలకృష్ణ ఇలా పరస్పరం ఒకే రోజు తలపడితే ఎవరికి సేఫ్ ఎవరికి రిస్క్ అనే ప్రశ్న తలెత్తడం సహజం. దీనికి సమాధానం ఒక్క పదంలో చెప్పాలంటే ఇద్దరికీ బెనిఫిట్ ఉంది. అదెలాగో చూద్దాం.
క్రిస్మస్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి పొటెన్షియాలిటీ ఉంటుంది. దాన్ని వాడుకోవడం తెలియాలి అంతే. అందుకే రెండేళ్ల క్రితం సలార్ సరిగ్గా ఆ టైంలో వచ్చి వసూళ్ల వర్షం కురిపించుకుంది. ఇప్పుడు కింగ్ 100, దాదా (ప్రచారంలో ఉన్న టైటిల్) క్లాష్ అయితే దాని వల్ల థియేటర్ల పంపకాల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చేమో కానీ రెవిన్యూ పోగొట్టుకోవడం లాంటివి ఉండవు. రెండింటికి డీసెంట్ లేదా సూపర్ హిట్ టాక్ వస్తే సంక్రాంతి తరహాలో ఇద్దరూ కలెక్షన్లను పంచుకోవచ్చు.
ఎందుకంటే సంక్రాంతికి హీనపక్షం అయిదు సినిమాలు వచ్చేలా ఉన్నాయి. ఇంకో రెండు మూడు తోడైనా ఆశ్చర్యం లేదు. వాటి మధ్యలో ఎవరికి ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయో, ఎవరికి లాంగ్ రన్ దక్కుతుందో ఎవరూ ముందే చెప్పలేరు. అలా కాకుండా డిసెంబర్ చివరి వారంలోనే వచ్చేస్తే ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. షారుఖ్ ఖాన్ కింగ్, ఎవెంజర్స్ డూమ్స్ డే వల్ల ఓవర్సీస్ లో సమస్యలు రావొచ్చేమో కానీ బాలయ్య, నాగ్ ఇద్దరికీ లోకల్ మార్కెట్ కీలకం కాబట్టి తెలుగు రాష్ట్రాలనే టార్గెట్ చేస్తారు.
తాజాగా బాలయ్య వేగంగా కోలుకుంటున్నారు. ప్రసాద్ ల్యాబ్స్ లో రేపటి నుంచి డబ్బింగ్ కూడా స్టార్ట్ చేస్తారట. బ్యాలన్స్ షూటింగ్ ఇంకో వారం పది రోజుల్లో రీ స్టార్ట్ కానుంది. చేతిలో ఉన్న మూడున్నర నెలల సమయం సరిపోతుందని దర్శకుడు గోపీచంద్ మలినేని హామీ ఇవ్వడం వల్లే నిర్మాత వెంకట సతీష్ కిలారు డిసెంబర్ డెసిషన్ తీసుకున్నారట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో బాలయ్య చాలా కొత్తగా కనిపిస్తారని సమాచారం. ఆల్రెడీ టీజర్ లో చూపించిన శాంపిల్ అభిమానులకు ఫుల్లుగా నచ్చేసింది.
This post was last modified on August 31, 2026 7:36 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…