తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మార్కెట్, ఇమేజ్ రెండూ ఉన్నాయి. మహానటి, సీతారామం బ్లాక్ బస్టర్స్ తన రేంజ్ ని అమాంతం పెంచేయగా లక్కీ భాస్కర్ ఏకంగా వంద కోట్ల క్లబ్బులోకి తీసుకెళ్ళిపోయింది. ఇవన్నీ టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీసే. కనులు కనులను దోచాయంటే లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాయి. దుల్కర్ కి మన ప్రేక్షకుల మీద ఎంత గురి అంటే ఆకాశంలో ఒక తార, శ్రీశ్రీ అని మరో రెండు తెలుగు సినిమాలు ఫినిషింగ్ కి తెచ్చాడు.
ఇలాంటి టైంలో తన కొత్త మూవీ వస్తోందంటే వీలైనంత బజ్ కనిపించాలి. కానీ ఐయామ్ గేమ్ విషయంలో అలాంటి హడావిడి చోటు చేసుకున్నట్టుగా లేదు. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నాడు. కాలేజీలలో ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. అయితే మార్కెటింగ్ పరంగా మేకర్స్ ఎక్కువ ఫోకస్ పెట్టకపోవడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించేలా ఉంది. ఎందుకంటే ఒకపక్క ఇరుముడి జోరు ఇంకా కొనసాగుతుండగానే సెప్టెంబర్ 3, 4 తేదీల్లో చాలా రిలీజులు క్యూ కట్టాయి.
ఐయామ్ గేమ్ లో కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. గ్యాంబ్లింగ్ లో కోట్లు సంపాదించిన యువకుడు దాంట్లోనే మొత్తం పోగొట్టుకుని మానసిక రోగానికి గురవుతాడు. తిరిగి కోలుకున్నాక పోగొట్టుకున్న చోటే గెలవాలనే సంకల్పంతో మళ్ళీ గ్యాంబ్లింగ్ ఆటలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో జరిగిన సంఘటనలే ఐయామ్ గేమ్ కథ. ఆర్డిఎక్స్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నహస్ హిదాయత్ దర్శకుడు కావడంతో అంచనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
ఇక పోటీ విషయానికి వస్తే రోమాంచకం బాగానే సౌండ్ చేస్తోంది. కేరళలో వంద కోట్లు దాటేసిన బెత్లేహమ్ కుటుంబ యూనిట్ కొంత లేట్ అయినా తెలుగులోకి మైత్రి సంస్థ తీసుకొస్తోంది. సహ అనే చిన్న సినిమాని సోషల్ మీడియాలో బాగానే ప్రచారం చేస్తున్నారు. ఇవి కాకుండా మీర్జాపూర్ కూడా తెలుగు డబ్బింగ్ తో వస్తోంది. ఇంత కాంపిటీషన్ పెట్టుకుని కాస్తంత లో ప్రొఫైల్ తో వస్తున్న ఐయామ్ గేమ్ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. సరిపోదా శనివారం ఫేమ్ జేక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు.
This post was last modified on August 31, 2026 7:09 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…