Movie News

జానర్ మార్చాడు.. హిట్టొస్తుందా?


రాజ్ తరుణ్ హిట్టు కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ అతడి చివరి హిట్. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ తర్వాత అతడికది హ్యాట్రిక్ హిట్ కావడం విశేషం. ఆపై రాజ్ తరుణ్ పది సినిమాలకు పైగానే చేశాడు. వాటిలో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. సినిమా సినిమాకూ అతడి స్థాయి, మార్కెట్ పడుతూ వచ్చి.. చివరికి ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా సమయానికి పూర్తిగా కింద పడిపోయాడు.

ఇలాంటి సమయంలో రాజ్ కొత్త చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీ‌లో రిలీజ్ కావడం అతడికి ఉపశమనమే. ఓటీటీలో కాబట్టి జనాలు ఓ మోస్తరుగా చూశారు. పెద్దగా విషయం లేని ఈ చిత్రం థియేటర్లలో రిలీజై ఉంటే పెద్ద షాక్ తగిలేదే. ‘ఒరేయ్ బుజ్జిగా’ను హిట్‌గా ప్రచారం చేసుకున్న రాజ్ తరుణ్, దాని దర్శకుడు విజయ్ కుమార్ కొండా తమ కలయికలో ఇంకో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు.

ఈసారి తమ గత చిత్రానికి భిన్నమైన సినిమానే చేయబోతోంది ఈ జోడీ. ఈ సినిమా పేరు.. పవర్ ప్లే. ఇదొక సీరియస్ థ్రిల్లర్ అనే విషయం, టైటిల్, దాని లోగో, ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. టైటిల్ మీద రక్తపు మరకలున్నాయి. రాజ్ తరుణ్ సీరియస్‌గా గన్ను పట్టుకుని కూర్చుని ఉన్నాడు. పోస్టర్ థీమ్ అంతా కూడా సినిమా చాలా సీరియస్‌గా ఉంటుందని, థ్రిల్లింగ్‌గా సాగుతుందని సంకేతాలు ఇస్తోంది. దేవేష్, మహిధర్ అనే కొత్త నిర్మాతలు వనమాలి క్రియేషన్స్ అనే బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ తరహా సీరియస్ థ్రిల్లర్ చేయడం విజయ్ కుమార్‌కు కొత్త. తొలి రెండు సినిమాలు గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా ప్రేమకథ లవ్ స్టోరీలు కాగా.. మూడోది కామెడీ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాలు తీసిన దర్శకుడు థ్రిల్లర్‌ను ఎలా డీల్ చేస్తాడో చూడాలి. జానర్ మార్చిన రాజ్‌కు ఈ చిత్రంతో అయినా మంచి ఫలితం అందుతుందేమో చూడాలి.

This post was last modified on January 15, 2021 6:00 pm

Share

Recent Posts

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

1 hour ago

రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…

2 hours ago

పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…

2 hours ago

రవితేజకు జోడీ ఎవరు?

మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…

2 hours ago

మస్క్‌కు BYD ప్రశ్న… సమాధానం ఏది?

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…

2 hours ago

టార్గెట్ @ 100 ప‌ర్సంట్‌: మంత్రుల‌కు బాబు బిగ్ టాస్క్‌

ఏపీ మంత్రుల‌కు సీఎం చంద్ర‌బాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఏపీ మంత్రివ‌ర్గం..…

2 hours ago