Movie News

రణబాలి కొత్త తేది… భలే స్ట్రాటజీ ఇది

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలయికలో రూపొందుతున్న రణబాలి కొత్త విడుదల తేదీ వచ్చేసింది. అక్టోబర్ 16 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు మైత్రి సంస్థ అధికారికంగా ప్రకటించింది. టాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ వాస్తవానికి సెప్టెంబర్ 11 రావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం, రష్మికకు మరో సినిమాలో గాయం కావడం లాంటి కారణాలు వాయిదాకు దారి తీశాయి.

దీని వెనుక ఒక ఆసక్తికరమైన స్ట్రాటజీ ఉంది. ప్రస్తుతానికి దసరా పండగని లక్ష్యంగా చేసుకున్న సినిమా జైలర్ 2 ఒకటే. అది కూడా కన్ఫర్మ్ గా వస్తుందా రాదానే దాని మీద చెన్నై వర్గాల్లో అనుమానాలు లేకపోలేదు. సన్ పిక్చర్స్ అయితే అక్టోబర్ 15 అనే చెబుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2 రావాల్సిన వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ ఇంకా పనులు పెండింగ్ ఉండటం వల్ల డేట్ మార్చుకునే ఆలోచనలో ఉన్నట్టు మొన్నటి నుంచే ప్రచారం ఊపందుకుంది. కానీ డిక్లేర్ చేయలేదు.

ఇలా ఎవరో స్లాట్ బుక్ చేసుకునేలా ఉన్నారని భావించి రణబాలి బృందం వెంటనే తమ డెసిషన్ చెప్పేసింది. నిఖిల్ స్వయంభు విడుదల ప్రకటన ఇవాళో రేపో వస్తుందని వినిపిస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ బృందం అలెర్ట్ కావడం ఒకరకంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే దసరా కీలకమైన సీజన్. రణబాలి వచ్చే రోజు నుంచి లెక్కేసుకుని చూసినా వరసగా అయిదు రోజులు సెలవులు ఉన్నాయి. ఓపెనింగ్ వసూళ్ళలో హాలిడేస్ బాగా దోహదం చేస్తాయి.

ఒకవేళ ఇంకో సినిమా ఏదైనా పోటీలో వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే దసరా కూడా ఈజీగా రెండు మూడు సినిమాలను అకామడేట్ చేస్తుంది. కాకపోతే పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలి. నవంబర్ లో రామాయణ, డిసెంబర్ లో ఫౌజీ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు చాలా ఉన్నాయి కనుక రణబాలి ముందే వచ్చేయడం మంచి నిర్ణయం. స్వాతంత్రం రాకముందు రాయలసీమలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా రణబాలి చాలా ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతోంది. 

This post was last modified on August 27, 2026 12:14 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

28 minutes ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

2 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

2 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

4 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

6 hours ago