మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ హీరోల్లో స్ఫూర్తిదాయక ప్రయాణం అంటే రవితేజదే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కొన్నేళ్లు ఆ విభాగంలోనే శ్రమించి.. ఆ తర్వాత క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ చేసి.. ఆపై హీరోగా చిన్న సినిమాలు చేసి.. చివరికి స్టార్ ఇమేజ్ సంపాదించి ‘మాస్ మహారాజా’గా పేరు తెచ్చుకున్న ఆసక్తికర ప్రస్థానం అతడిది. ప్రస్తుతం టాప్ స్టార్ల తర్వాతి స్థాయిలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటుడు రవితేజే. అతడికి పది కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుతోంది.
లేటెస్ట్ మూవీ ‘క్రాక్’లో లాభాల్లో వాటా తీసుకోవడం ద్వారా కెరీర్లోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. వరుస ఫ్లాపుల తర్వాత ఈ రేంజిలో రెమ్యూనరేషన్ తీసుకోవడమంటే మాటలు కాదు. రెండు మూడు వరుస హిట్లు పడితే మాస్ రాజా రేంజ్ ఇంకా పెరగొచ్చు.
ఐతే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న రవితేజ.. కెరీర్ ఆరంభంలో తన తొలి సినిమాకు అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా..? కేవలం 3500 రూపాయలట. ఆ డబ్బులు ఇచ్చింది సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కావడం విశేషం. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రవితేజే స్వయంగా వెల్లడించాడు. నాగ్ సొంత సంస్థ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బేనర్లో తెరకెక్కిన ‘నిన్నే పెళ్లాడతా’ అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన తొలి చిత్రమని.. ఆ సినిమాకు కృష్ణవంశీ కింద పని చేశానని.. అందుకు గాను నాగ్ రూ.3500 మొత్తానికి చెక్కు రాసి తనకిచ్చాడని రవితేజ గుర్తు చేసుకున్నాడు.
సినీ పరిశ్రమలో తాను అందుకున్న తొలి చెక్కు కావడంతో దాన్ని మురిపెంగా దాచుకున్నానని.. చాలా రోజుల తర్వాత తనకు డబ్బులు ఎంతో అవసరం పడ్డ పరిస్థితుల్లోనే దాన్ని బ్యాంకులో వేసి డబ్బులు తీసుకున్నానని రవితేజ చెప్పాడు. రూ.3500తో మొదలుపెట్టి ఇప్పుడు పది కోట్లకు పైగా పారితోషకం తీసుకునే స్థాయికి చేరుకోవడమంటే రవిజేతది ఎంత స్ఫూర్తిదాయక ప్రయాణమో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on January 15, 2021 3:41 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…